Milad un nabi | భక్తి శ్రద్ధలతో మిలాద్-ఉన్-నబి ఉత్సవాలు

గోల్నాక : ముస్లింల ఆరాధ్యదైవం మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా నిర్వహించే మిలాద్-ఉన్-నబి పర్వదిన ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరిగాయి. మంగళవారం పండుగ సందర్భంగా అంబర్‌పేట, గోల్నాక డివిజన్లలోని పలు ప్రాంతాల్లో ముస్లిం సోదరులు భారీ ఊరేగింపులు నిర్వహించారు. గోల్నాక ఖాద్రీబాగ్ నుంచి అంబర్‌పేట పటేల్‌నగర్ చౌరస్తా మీదుగా బాపునగర్ వరకు ప్రధాన రహదారుల గుండా ర్యాలీలు నిర్వహించి సామూహిక భోజనాలు చేశారు.
అంబర్‌పేట పటేల్‌నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ కె.పద్మావతిడీపీరెడ్డి, బాగ్‌అంబర్‌పేట కార్పొరేటర్ బి.పద్మావతిరెడ్డి తదితరులు ఊరేగింపు లకు స్వాగతం పలికారు. గోల్నాక డివిజన్ ఖాద్రీబాగ్ మజీదు వద్ద ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్ గౌడ్ తదితరులు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అంబర్‌పేట ఇన్స్పెక్టర్ పేరం సుధాకర్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

