నిజామాబాద్‌సిటీ డిసెంబర్22: టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను సంఘ భవనంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ నారాయణరెడ్డి, నగర మేయర్ నీతూ కిరణ్ హాజరై కేక్ కట్‌చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, కార్యదర్శి అమృత్, జిల్లా కార్యవర్గ సభ్యులు, క్రైస్తవ మత పెద్దలు జోసఫ్, జాన్ సామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.
ఏడో పోలీస్ బెటాలియన్‌లో..
డిచ్పల్లి మండలంలోని ఏడో పోలీస్ బెటాలియన్‌లో కమాండెంట్ ఎన్వీ సత్యశ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమాండెంట్‌తో కలిసి కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ వెంకటేశ్వర్లు, ఏవో శ్రీదేవి, పాస్టర్లు, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, బెటాలియన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.