
కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలు
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గోపీనాథ్
షేక్‌పేట్, యూసుఫ్‌గూడలో బస్తీ దవాఖానలు ప్రారంభం
షేక్‌పేట్ డిసెంబర్ 3: బస్తీల్లోని పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం షేక్‌పేట్ డివిజన్ రాజీవ్‌గాంధీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, ఆయుష్ కమిషనర్ వర్షిణిలతో కలిసి ప్రారంభించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే మాగంటి మొక్కను అందించి స్వాగతం పలికారు. దవాఖానలోకి వెళ్లగానే సిబ్బందిని వైద్య సేవల గురించి వాకబు చేశారు.అనంతరం రోగుల పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను, చికిత్స గదిని పరిశీలించారు. దవాఖాన నుంచి బయటకు వచ్చి దివ్యాంగులను కలిసి వారితో ఫొటోలు దిగారు. అనంతరం మొబైల్ వ్యాక్సిన్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎంఅండ్ హెచ్‌వో డాక్టర్ వెంకటి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ అనురాధ, మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్, కార్పొరేటర్లు రషీద్ ఫర్హజుద్దీన్, రాజ్‌కుమార్ పటేల్, దేదీప్య, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ సేవాఎస్లావత్
యూసుఫ్‌గూడ బస్తీలో ..
జూబ్లీహిల్స్,డిసెంబర్3: దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వం బస్తీల్లో కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం యూసుఫ్‌గూడ బస్తీలో కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, దేదీప్య విజయ్‌లతో కలిసి బస్తీ దవాఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు ప్రైవేట్ దవాఖానల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి అప్పులపాలు కావద్దని సీఎం కేసీఆర్ నగరంలో బస్తీ దవాఖానలతో మెరుగైన వైద్య సేవలకు రూపకల్పన చేశారన్నారు. ఇందులో భాగంగా నగరంలో ఇప్పటికే 250 బస్తీ దవాఖానలు సేవలందిస్తుండగా మరో 50 దవాఖానలు పెంచేలా కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారి, జోనల్ కమిషనర్ ప్రియాంక, డిప్యూటీ కమిషనర్ రమేశ్, ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి, ఎస్పీహెచ్వో డాక్టర్ రేవతి పాల్గొన్నారు.