
తూప్రాన్/రామాయంపేట/అందోల్, డిసెంబర్ 15 : తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నదని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ, ప్రమాదవశాత్తు, కొవిడ్‌తో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు బుధవారం హైదరాబాద్‌లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఆర్థిక సాయం అందజేశారు. అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి ‘నమస్తే తెలంగాణ’ తూప్రాన్ విలేకరి చెలిమెల నాగరాజు భార్య లతకు రూ.లక్ష, జోగిపేటకు చెందిన జర్నలిస్టు ఊస శ్రీనివాస్ తల్లికి లచ్చమ్మకు రూ.2 లక్షల చెక్కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జర్నలిస్టుగా అక్రిడిటేషన్ కార్డు కలిగి ఉండి, వివిధ పత్రికల్లో పని చేసే జర్నలిస్టు కుటుంబాలను ప్రభుత్వ సహకారంతో ప్రెస్‌క్లబ్ అకాడమీ ఆధ్వర్యంలో అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. మృతుల కుటుంబాలు అధైర్యపడకుండా ఉండాలన్నారు. బాధిత కుటుంబాలకు పెన్షన్ కూడా అందిస్తామన్నారు. లతకు మూడేండ్ల పాటు, లచ్చమ్మకు ఐదేండ్ల పాటు రూ.3వేల చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మె ల్సీ గోరెంటి వెంకన్న, ఎమ్మెల్యే చంటి క్రాం తికిరణ్, మెదక్ జర్నలిస్టు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అశోక్ ఉన్నారు.