ఎల్బీనగర్ : సీఎం రిలీఫ్ పండ్తో ఎంతో మంది పేదలకు మేలు జరుగుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం భూపేష్‌గుప్తానగర్‌కు చెందిన శేఖర్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ కింది రూ. 1.25 లక్షల చెక్కును ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం సహాయనిధి దోహదపడు తోందన్నా రు. పేదలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలను పొందేందుకు ప్రభుత్వం నుండి బరోసా లభిస్తోందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పేదలకు సీఎం సహాయనిధి ద్వారా చేయుత లభిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, డేరంగుల కృష్ణ, శ్రీనివాస్ యాదవ్, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.