
ఉమ్మడి జిల్లాలోని హైవే-44పై మొక్కలు నాటి ప్రయాణికులకు ఆహ్లాదం పంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం పాలమూరు రెవెన్యూ సమావేశ మందిరంలో జాతీయ రహదారిపై హరితహారం, కొవిడ్ వ్యాక్సి నేషన్‌పై రాష్ట్ర స్థాయి అధికారులు, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు, వైద్య, ఆరోగ్య, ఎన్హెచ్ఏఐ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఇతర అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్‌హెచ్‌పై హరితహారం గొప్పదనం ఉట్టిపడేలా బహుళ వరుసల్లో పూల మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలు ప్రకృతి రమణీయతకు అద్దం పట్టాలన్నారు. ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రం నుంచి ఏపీలోని కర్నూల్‌కు వెళ్లే 44 వ నంబర్ జాతీయ రహదారిపై హరితహారం కింద ప చ్చదనాన్నిచ్చే మొక్కలతో పాటు పూల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి వెంట హరితహారం గొప్పదనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్ రె వెన్యూ సమావేశ మందిరంలో 44వ జాతీయ రహదారిపై హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమంపై రాష్ట్ర స్థాయి అధికారులు, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు, ఎన్హెచ్ఏఐ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మీదుగా వెళ్తున్న 44 హైవే వెంట ఉన్న 141 కి.మీ. మేర ఇరువైపులా బహుళ వరుసల్లో పూల మొక్కలు నాటాలన్నారు. తెలంగాణ నుంచి ఏపీ వెళ్లే వారికి ఆహ్లాదాన్ని పంచేలా, హరితహారం ఔన్నత్యాన్ని అందరికీ చాటేలా కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు మూడు వరుసల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ.. మిషన్ భగీరథ పైప్లైన్లు, ఇతర కారణాల వల్ల మిగిలిపోయిన స్థలాల్లో కూడా మొక్కలు నాటే ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎంత ప్రాంతంలో ఇంకా మొక్కలు నాటా ల్సి ఉందో ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. పది రోజుల్లో ఈ ప్రణాళిక పూర్తి చేయడమే కాకుండా ఎలాంటి మొక్కలు నాటాలో కూడా కార్యాచరణ త యారు చేయాలన్నారు. ఒక్కో కి.మీ. దూరానికి మొక్క లు మార్చాలని, పచ్చదనంతో పాటు ప్రకృతి రమణీయతకు అద్దం పట్టేలా పూల మొక్కలను నాటాలన్నా రు. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణపై దృష్టి సారించాలన్నారు. సెంట్రల్ మీడియన్ డిజైన్‌కు తుది రూపం ఇచ్చి ఈనెల 10వ, తేదీలోపు ప్రణాళికను పూర్తిచేసే విధంగా రాష్ట్ర స్థాయి, జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అంతకుముందు పీసీసీఎఫ్ ఆర్.శోభ జాతీయ రహదారిపై హరితహారం కింద నాటిన మొక్కలపై వివరించారు. సమావేశంలో జాతీయ రహదారుల సంస్థ అధికారి కృష్ణ ప్రసాద్, పం చాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సీఎం ఓఎస్డీ ప్రి యాంక వర్గీస్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శరత్, పీసీసీఎఫ్ దొబ్రియల్, కలెక్టర్లు వెంకట్రావు, ఉదయ్ కుమార్, షేక్ యాస్మిన్ బాషా, హరిచందన, క్రాంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అదనపు కలెక్టర్లు, డీఎఫ్‌వోలు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.