
నిజాంపేట,డిసెంబర్ 11:రైతులు వానకాలం, యాసంగిలో ఒకే రకం పంట సాగు చేయ డంతో ఇతర పంటల సాగు తగ్గింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే అన్నదాతలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్ర భుత్వం పని చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మా త్రం ధాన్యం కొనుగోలు చేయమని స్పష్టం చేసింది. దీంతో రైతన్నలు ఇబ్బందు లు పడకూడదని సీఎం కేసీఆర్ ఇతర పంటలను సా గు చేయాలని సూచిస్తున్నారు. ఆరుతడి పంటలైన కంది, వేరుశనగ, మొక్కజొన్న, కూరగాయలు, నువ్వులు పంటలను సాగు చేస్తే అన్నదాతలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు.
ఆరుతడి పంటల సాగుకు తక్కువ పెట్టుబడి
ఇతర పంటలను సాగుచేయడానికి తక్కువగా నీళ్లు అవసరమవుతాయి.విద్యుత్ వినియోగంతో పాటు తక్కువ పెట్టుబడితో అధికంగా దిగుబడులు పొందవచ్చు. ఎకరం భూమిలో వరి పంట సాగు చేయుటకు కావాల్సిన నీళ్ల తో 3 ఎకరాల్లో ఆరుతడి పంట సాగు చేయవచ్చు.
వేరుశనగ పంటకు డిమాండ్ ఎక్కువ…
ప్రస్తుతం నూనెగింజలకు మార్కెట్లో ఎక్కు వ డిమాండ్ ఉంది వేరుశనగ సాగుకు ఎర్రరేగడి నే లలు అనుకూలం. ఒక ఎకరంలో వేరుశనగ పంటను సాగు చేయడం వల్ల దాదాపు 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. అదేవిధంగా ఆదాయం అధికంగా వస్తుంది. మండలంలోని రాంపూర్‌లో రైతు సిద్ధయ్య 2 ఎకరాల్లో వేరుశనగ పంటను సాగుచేస్తూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నా డు. అందుబాటులో నీళ్లు ఉన్నప్పటికీ వరికి బదులు నూనెగింజల పంటలకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్నందున చూసి వేరుశనగతో పాటు గోధుమ, ఆకుకూరలను పండిస్తున్నాడు. వేరుశనగ సాగులో వ్యవసాయ అధికారుల సూచనలు, యాజమాన్య పద్ధ తులను పాటిస్తున్నాడు.
వేరుశనగ సాగు చేస్తున్న
నావ్యవసాయ పొలంలో 2 ఎకరాల్లో మేర వేరుశనగ పంట వేశాను.వ్యవసాయ అధికారుల సూచనలు మేరకు వేరుశనగ పంటను సాగుచేస్తున్న, ఆరుతడి పంటలను సాగు చేయాలని, తద్వారా అధిక దిగుబడులు పొందుతారని వ్యవసాయ అధికారులు రైతులకు సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం నేను సాగు చేస్తున్న వేరుశనగ పంట పూత దశలో ఉంది.ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చేట్టు ఉంది. -సిద్ధయ్య రైతు ,రాంపూర్
ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తున్నాం
నిజాంపేట మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో స్థానికంగా ఉన్న రైతులకు సమావేశాలను ఏర్పాటు చేసి ఆరుతడి పంటలను సాగుచేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. ఇతర పంటలు సాగు చేయడం ద్వారా కలిగే లాభాలను వారికి తెలుపుతూ ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నాం. రైతులు ఏ పంటలు వేస్తున్నారో వాటి వివరాలను తెలియజేయాలని సూచిస్తున్నాం.