షాద్నగర్, డిసెంబర్16: రైతుల ఆలోచనలు మారుతున్నా యి. సాగు విధానంలో వస్తున్న మార్పులను గమనిస్తూ డి మాండ్ ఉన్న పంటలపై దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడితోపాటు కూలీల సమస్యను అధిగమించేలా సాగు విధానా న్ని ఎంచుకుంటున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా వాణిజ్య పంటలపై ఆసక్తి చూపుతూ లాభాలను గడిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ సాగు మార్గంలో నడుస్తున్నారు. ఫలితంగా తోటి రైతులకు ఆదర్శంగా నిలువడమే కాకుండా లాభాలను పొందుతున్నారు షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం తంగేళ్లపల్లికి చెందిన వీరయ్యగుప్తా అనే రైతు. ఆయన సేంద్రియ పద్ధ్దతిలో చెరుకు, అరటి పంటలను సాగు చేసి లాభాలను పొందుతున్నారు.
సేంద్రియ సాగువైపు ..
సాధారణ సాగు విధానంలో రసాయన ఎరువుల వినియోగం పెరిగి భూసారం దెబ్బతిని ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాదని గ్రహించిన రైతులు సేంద్రియ వ్యవసాయంవైపు మొగ్గుచూపుతున్నారు. మొదటగా జిలుగ, జనుమును పొ లంలో పండించిన అనంతరం పంటను పూర్తిగా దుక్కిచేసుకోవాలి. భూమిలో పోషకాలు నిండిన తర్వాత పశువుల ఎరువును చల్లి తగిన పంటను సాగుచేసుకోవాలి. ఈ తరహాలోనే వీరయ్యగుప్తా తనకున్న 12 ఎకరాల పొలంలో అరటి, చెరుకు పంటలను సేంద్రియ విధానంలో సాగు చేస్తూ అధిక లాభాల ను పొందుతున్నారు. నాలుగు ఎకరాల్లో జీ-9 అనే రకం అర టి పంటను, మరో ఐదు ఎకరాల్లో 2003 వీ 46 రకం చెరుకు పంటను సాగుచేశారు. మిగితా ఎకరాల్లో ఇతర పంటలను సా గు చేశారు. పంటల ఎదుగుదలకు పశువులు, డంపింగ్ యార్డు ఎరువులతోపాటు జీవామృతం, ఘన జీవామృతాన్ని వినియోగించారు. చీడపీడల నివారణకు పలు ద్రవాలను పిచికారీ చేశా రు. ఇలా ఏడాదిపాటు పంట చేతికొచ్చే వరకు ఎకరానికి రూ. 20 నుంచి 30 వేలను ఖర్చు చేశారు. చేతికొచ్చిన అరటి గెలకు బహిరంగ మార్కెట్లో కిలో ధర రూ. 20 నుంచి 40వరకు పలుకుతున్నది. ఇలా ఎకరం అరటి సాగులో రూ.1.5 లక్షల నుంచి 2 లక్షల లాభాన్ని పొందొచ్చు. అదేవిధంగా చెరుకును ప్రస్తుత మార్కెట్లో టన్ను ధర రూ.3,130 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఎకర పొలంలో చెరుకు సాగు చేస్తే రూ.లక్ష నుంచి 1.5 లక్షల ఆదాయం వస్తుంది. ఇలా సేంద్రియ విధానం సాగుతో రైతులకు పెట్టుబడులు చాలా వరకు తగ్గుతాయి. సాధారణ సాగుతో పోల్చుకుంటే సేంద్రియ విధానంతో 60 శాతం మేర పెట్టుబడులు మిగులుతాయని పలువురు రైతులు పేర్కొంటున్నారు. అరటి, చెరుకు పంటలతోపాటు ఇతర కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తే మరింత లాభాదాయకంగా ఉండటంతోపాటు భూసారం, దిగుబడి కూ డా ప్రతి ఏడాది పెరుగుతుందని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు.