అంబర్పేట : సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరంలా మారిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అంబర్పేట కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.