మాదాపూర్ : ప్రముఖ డిజైనర్ల చేతుల మీదుగా తయారు చేయబడిన వస్త్రాలు, ఆభరణాలు నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గురువారం మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో హై లైఫ్ బ్రైడ్ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనకు మిస్ ఎర్త్ ఇండియా తేజస్వి మనోజ్ఞ, నటీ వర్షిణి సౌందరాజన్, వెన్నెల, హర్షదా పాటిల్‌లు పాల్గొని నిర్వాహకుడు డోమినిక్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా తేజస్వి మనోజ్ఞ మాట్లాడుతూ … హై లైఫ్ బ్రైడ్ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనలో నగర వాసులను ఆకర్శించే విధంగా సరికొత్త ఉత్పత్తులు కొలువుదీరాయని, ఇందులో వస్త్రాలు, ఆభరణాలు విశేషంగా ఆకట్టుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం నిర్వాహకుడు డోమినిక్ మాట్లాడుతూ … ప్రముఖ డిజైనర్లచే రూపొందించబడిన వస్త్రాలు, ఆభర ణాలతో పాటు గృహోపకరణ ఉత్పత్తులు, వివాహ శుభ కార్యాలకు కావలసిన దుస్తులు, ఇతర ఉత్పత్తులను ప్రదర్శనలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
చెన్నై, సూరత్, కొచ్చి, బెంగళూరు, ముంబయితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రముఖ డిజైనర్లతో రూపొందించిన వస్ర్తాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని వివరించారు. సరికొత్త డిజైన్లతో రూపొందించిన బంగారు ఆభరణాలు నగర వాసులను ఆలరించడం ఖాయమన్నారు. మూడురోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో అన్ని రకాల ఉత్పత్తులు ఒకే వేదికపై ఏర్పాటు చేసినట్లు తెలిపారు.