మాదాపూర్ : విద్యార్థులు సృజనాత్మకత నైపుణ్యతను జోడించి సరికొత్త డిజైన్లతో కూడిన ఉత్పత్తులను ప్రదర్శించారు. మాదాపూర్‌లోని నిఫ్ట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) కళాశాల ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్ 2021 లో పలు ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారులు వారి ఉత్పత్తులను ప్రదర్శించారు.
నిఫ్ట్ కళాశాల విద్యార్థులు చేతితో తయారు చేసిన రకరకాల డిజైన్లతో కూడిన ఉత్పత్తులను ప్రదర్శించారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 20కి పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మలు, ఇక్కత్, మంగళగిరి, ఉదయగిరి ప్రాంతాలకు చెందిన వస్త్రాలను స్టాల్స్‌లో ప్రదర్శించారు.
ఉడ్‌తో తయారు చేయబడిన గృహోపకరణ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. నిఫ్ట్ కళాశాలలో అక్కడక్కడ మొక్కలను పెంచేందుకు ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెలపై విద్యార్థులు రకరకాల డిజైన్లతో పేయింటింగ్లను వేసి ఆకర్శిణీయంగా ఏర్పాటు చేశారు.
ఆకట్టుకున్న ఫ్యాషన్ షో…
ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తు నిఫ్ట్ విద్యార్థులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నారు. విద్యార్థులచే తయారు చేసిన పలు డిజైన్లతో కూడిన వస్త్రాలను ఫ్యాషన్ షో లో ప్రదర్శించారు. ఇందులో ఒక్కోక్కరు ఒక్కో ప్రాంతానికి చెందిన వస్త్రాలను వారి సాంప్రదాయానికి ప్రతీకగా డిజైన్లను ఏర్పాటు చేసి ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తు అలరించారు.