
పెద్దమందడి, డిసెంబర్ 23 : రాష్ట్రంలో ఉద్యాన రం గం ఎంతో అభివృద్ధి చెందిందని ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్, ఇన్చార్జి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పిడిగెం సైదయ్య అన్నారు. గురువారం మండలంలోని మోజర్ల సమీపంలో ఉన్న కళాశాలలో ఉద్యాన విశ్వవిద్యాలయం 7వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా కొండా లక్ష్మణ్ బాపూజీ చి త్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యాన పంటల సాగుపై రై తులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూరగాయలు, పండ్ల తోటలు, వివిధ పం టల సాగు గురించి వివరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రం లో 48 శాతం ఎర్రనేలలు ఉద్యాన పంట సాగుకు అ త్యంత అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో కూరగాయలు, పండ్ల వినియోగం పెరిగిందని, అందుకుగానూ ఇవే పంటలు సాగు చేసి లాభాలు పొందాలన్నారు. కూరగాయల సాగుచేసే రైతులకు ఉద్యాన శాఖాధికారుల సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. వరికి బదులుగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించి అధిక దిగుబడులు సాధించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ కళాధర్బాబు, అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ రామకృష్ణ, ఓఎస్ఏ ప్రశాంత్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నాగరాజు, శ్రీనివాస్, చంద్రశేఖర్, అశ్విన్, సంతోషిని, విద్యార్థులు పాల్గొన్నారు.