
రామాయంపేట, డిసెంబర్ 23: రైతులు ఇతర పంటలను సాగు చేసుకోవాలని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి అన్నారు. గురువారం రామాయంపేట రైతువేదికలో క్లస్టర్ పరిధిలోని రైతులకు ఇంతర పంటలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, తహసీల్దార్ శేఖర్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారి రాజ్‌నారాయణ, ఏ ఈవో వినోద్‌కుమార్ ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
జడ్చెరువు తండాలో….
నిజాంపేట,డిసెంబర్ 23: ఆరుతడి పంటలను సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్ అన్నారు. మండలంలోని జడ్చెరువు తండా పంచాయతీ కార్యాలయంలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పరశురాంనాయక్ మాట్లాడుతూ యాసంగి సీజన్లో ఎఫ్‌సీఐ వడ్లను కొనుగోలు చేయడం లేదని, వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలన్నారు. అనంతరం ఆయన రైతులతో కలసి ఆరుతడి పంటలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఈవో రాజు, రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్ మంగ్యానాయక్, రైతులు ఉన్నారు
అప్పాజిపల్లిలో…
కొల్చారం, డిసెంబర్ 23: పంటమార్పిడితో భూములు సారవంతంగా మారుతాయని నర్సాపూర్ ఇన్చార్జి ఆర్డీవో సాయిరాం అన్నా రు.మండల పరిధిలోని అప్పాజిపల్లిలో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. సమావేశంలో తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు, మండల వ్యవసాయాధికారి బా టల్రెడ్డి, సర్పంచ్ ఝాన్సీలక్ష్మి, ఏఈవో వినితభవాని, రైతులు పాల్గొన్నారు.
చిలిపిచెడ్,చండూర్ గ్రామాల్లో…
చిలిపిచెడ్,డిసెంబర్ 23: యాసంగి లో రైతులు ఆరుతడి పంటలే సాగు చేయాలని సంగుపేట ఏరువాక శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ, నాయాబ్తహసీల్దార్ స్టీఫెన్ సూచించారు. చిలిపిచెడ్,చండూర్ గ్రామాల్లో రైతులు ఆరుతడి పం టలే సాగు చేయాలని అవగాహన కల్పించారు. కార్యక్రమం లో ఆర్ఐ రుక్మొద్దీన్, ఏఈవో స్రవంతి, భూపాల్, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు వెంకటేశం, సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, రైతులు నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
నర్సాపూర్ …
నర్సాపూర్, డిసెంబర్ 23: మండల పరిధిలోని నారాయణపూర్, మూసాపేట్, ఖాజీపేట్, నత్నయిపల్లి గ్రామాల్లో ఇతర పంటలపై రైతులకు వ్యవసాయాధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిఫ్యూటీ తహసీల్దార్ నవీన్, ఏఈవోలు రాజు, శ్రీధర్, ప్రసాద్, హరికృష్ణ పాల్గొన్నారు.
మనోహరాబాద్ …
మనోహరాబాద్, డిసెంబర్ 23: పంటమార్పిడితో దిగుబడి అధికంగా ఉంటుందని ఏవో స్రవంతి అన్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి, కొండాపూర్ గ్రామాల్లో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లేశ్ , ఎంపీటీసీ లావణ్య, తహసీల్దార్ భిక్షపతి, ఏఈవో సచిన్, రైతులు పాల్గొన్నారు.
మెదక్‌రూరల్ ..
మెదక్‌రూరల్, డిసెంబర్ 23: రైతులు ఇతర పంటల సాగు పై దృష్టి సారించాలని మెదక్ రెవెన్యూ డివిజన్ అధికారి సాయిరాం అన్నారు. మండల పరిధిలోని బాలనగర్, చిట్యాలలో పంటలసాగు పై అవగాహన కార్యక్రమంలో సాయి రాం, వ్యవసాయ డివిజన్ అధికారి నగేశ్ పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు.