
రామాయంపేట రూరల్, డిసెంబర్ 19 : ప్రభుత్వం కుల వృ త్తులను అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నది. అనేక సంక్షేమ ప థకాలు అమలు చేస్తున్నది. దీంతో వారు ఆర్థిక అభివృద్ధి చెందుతున్నారు. ఇందులో భాగంగా గొల్ల, కుర్మల అభివృద్ధి కోసం ఒక్కోయూనిట్ కింద 20 గొర్రెలను ఒక మేకపోతు ప్రభుత్వం పంపిణీ చేసింది. గొల్ల, కుర్మలు వాటి సంతతి వృద్ధి చేసుకొని అమ్ముకొని లాభాలు పొందుతున్నారు. వ్యవసాయం కంటే ఈ గొర్రెల పెంపకం ఎంతో లాభదాయకంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో 7100 గొర్రెలు అందజేత
రామాయంపేట మండలంలో 7100 గొర్రెలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ విధంగా ఒక్కో యూనిట్లో 20 గొర్రెలను లబ్ధిదారులకు అందజేశారు. దామరచెర్వుకు 7 యూ నిట్లు, రామాయంపేటకు 64 యూనిట్లు, కోమటిపల్లికి 34 యూనిట్లు, కోనాపూర్‌కు 84 యూనిట్లు , డీధర్మారం, శివాయిపల్లికి 42 యూనిట్లు, అక్కన్నపేటకు 27 యూ నిట్లు, తొనిగండ్లకు 34 యూనిట్లు, కాట్రియాలకు 42 యూనిట్లు, దంతేపల్లికి 21 యూనిట్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. మండలంలో సుమారు 7,100 గొర్రెలను లబ్ధిదారులకు అందజేశారు.
ప్రభుత్వ నిర్ణయం సంతోషంగా ఉంది
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 20 గొర్రెలు నాకు అందాయి. అంతకు ముందు నేను దుబాయిలో ఉండే వాన్ని. సబ్సిడీపై గొర్రెలను తీసుకొని వాటిని కాస్తున్నాను. అంతకు ముందు నాకు 100కు పైగా గొర్లు, మేకలు ఉండేవి. ప్రభుత్వం ఇచ్చిన తరువాత వాటి సంఖ్య 200కు చెరింది. దీంతో ఆదాయం పెరిగింది.
-మల్లేశ్, గొర్రెల కాపరి తొనిగండ్ల
ఫలితాలు వస్తున్నాయి
ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలు మం చి ఫలితాలు ఇస్తున్నాయి. గతం లో మాకు సుమారు 150కి పైగా గొర్లు, మేకలు ఉండేవి. కానీ ప్ర భుత్వం ఇచ్చిన గొర్రెలు తరువా త వాటి సంఖ్య పెరిగింది. దీంతో మా ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుపడింది. మార్కెట్లో మంచి ధర ఉంది. ఎల్లప్పుడు ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – కొమ్మురయ్య, గొర్ల కాపరి తొనిగండ్ల
సద్వినియోగం చేసుకోవాలి..
ప్రభుత్వం అందించిన గొర్రెలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆదాయం పొందే మార్గాలు కూడా ఉంటాయి. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి.- సుధాకర్ దేశ్‌ముఖ్, మండల పశువైద్యాధికారి