కాచిగూడ : ఫోన్లో మాయమాటలు చెప్పి రూ.50 వేల రూపాయలను తస్కరించిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదేందర్ తెలిపిన వివరాల ప్రకారం బర్కత్‌పురలోని ప్యారాగాన్, వెంకటాద్రి అపార్ట్‌మెంట్‌కు చెందిన నారాయణస్వామి కుమారుడు కె.నిఖిల్ (29) అమెజాన్ లో ఉద్యోగి.
గత నెల 30 న బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన శ్రీరామ్ అనే వ్యక్తి అన్లైన్ ట్రేడింగ్ చేస్తే లక్షల రూపాయలు వస్తాయని నిఖిల్‌కు మాయమాటలు చెప్పాడు. శ్రీరామ్ మాయ మాటలు నమ్మిన నిఖిల్ అతని అకౌంట్లో రూ.50 వేల రూపాయలు వేశాడు. మరుసటి రోజు నుండి శ్రీరామ్ ఫోన్ స్వీచ్ఛాప్ అయింది.
దీంతో మోసపోయినట్లు గ్రహించిన నిఖిల్ బుధవారం కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేంద్రన్ తెలిపారు.