
దేవరకద్ర రూరల్, డిసెంబర్ 24 : ఇసుక తరలిచేందు కు వాగులోకి వచ్చిన జేసీబీకి గుర్తు తెలియని వ్యక్తులు ని ప్పంటించిన ఘటన చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామ శివారులో చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి కథనం మేరకు.. ముచ్చింతల గ్రామ శివారులో పారుతున్న ఊకచెట్టు వాగులో ఇసు క తవ్వేందుకు గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జేసీబీ వచ్చింది. వాగు నుంచి ఇసుక తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆగ్రహంతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీకి నిప్పంటించి పారిపోయారు. ఈ విషయాన్ని జేసీబీ యజమాని తిరుపతయ్య, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాగులో ఇసుక తవ్వేందుకు కలెక్టర్ నుంచి అనుమతులు ఉన్నాయని, అందుకే ఇసుక తీయడానికి వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు.
ఇసుక తరలించొద్దు..
ఊకచెట్టు వాగు నుంచి ఇసుకను ఎవరూ తరలించొద్ద ని, భూగర్భజలాలు అడుగంటి సాగునీటికి కష్టాలు ఏర్పడుతాయని వాగు సమీప గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. ఇసుక జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.