
ధాన్యం కొనుగోలు విషయాన్ని కేంద్రం రాజకీయం చేయడంతోపాటు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. తెలంగాణ రైతులంటేనే చులకన చేస్తూ మాట్లాడుతున్నది. ఇక్కడి రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వడ్లు కొనేందుకు ససేమిరా అంటున్నది.కర్షకుల కష్టం తెలిపేలా.. వారికి మద్దతుగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లిన మంత్రుల బృందానికి చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానంగా మాట్లాడడం.. ఆది నుంచి రైతులపై వివక్ష చూపుతుండడంతో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. తమను పట్టించుకోని ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని అన్నదాతలు హెచ్చరించారు.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లో వ్యవసాయం చేయడమే కష్టంగా ఉండేది. సాగు కంటే బీడు భూ ములే అధికంగా ఉండేవి. సాగునీటి సదుపాయం లేక కొందరు, బో ర్లు, బావుల కింద ఆయకట్టుకు అవకాశం ఉన్నా.. కరెంట్ లేక మరికొందరు, ఎలాగోలా సాగు చేద్దామనుకున్న వారికి పెట్టుబడి లేకపోవడంతో వ్యవసాయం చేయడమే గగనంగా ఉండేది. దీంతో చాలా మంది అన్నదాతలు కుటుంబాన్ని పోషించేందుకు వలస బాట పట్టేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక్కో రంగంలో ప్రభుత్వం విజయం సాధిస్తూ వచ్చింది. అన్నదాతలకు క రెంట్ సమస్య నుంచి ఉపశమనం కలిగించి.. 24 గంటల ఉచిత వి ద్యుత్ అందిస్తున్నది. సాగు నీరు పుష్కలంగా ఉండడంతో ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో 3 లక్షల ఎకరాలకు మించని పరిస్థితి నుంచి సుమా రు 10 లక్షల ఎకరాలు సాగయ్యే స్థాయికి తీసుకొచ్చింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువున్నింటినీ పునరుద్ధరించడంతో.. ప్రతి గ్రామంలో నూ జలకళ సంతరించుకున్నది. కరెంట్, సాగునీటి కష్టాలు తీర్చిన స ర్కార్.. పంట పెట్టుబడిని అందిస్తున్నది. దీంతో బీడుగా ఉన్న భూ ముల్లో బంగారు పంటలు పండుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోనే వరి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్‌వన్ రాష్ట్రంగా నిలిచింది. కొత్త రా ష్ట్రంలో పండించిన పంటను కొని రైతులకు ఆర్థికంగా అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నది. అంతేకాకుండా రాష్ట్రం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన బృందంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మంత్రులను, ప్రభుత్వాన్ని, రై తులను అవమానిస్తున్నారు. దీనిపై రైతులోకం భగ్గుమంటున్నది. మం త్రుల బృందం ఢిల్లీ వెళ్లింది సొంత పనుల కోసం కాదని.. రైతుల సమ స్య పరిష్కారం కోసమనే ఇంగిత జ్ఞానం కూడా కేంద్రానికి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విష యంలో కేంద్రం చేస్తున్న కుట్రలు అన్నీఇన్నీకావు. చెప్పిన ప్రకారం తెలంగాణ నుంచి బియ్యం సేకరించడంలో విఫలమైన కేంద్రం.. ఆ తప్పును తెలంగాణ సర్కార్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నది. సకాలంలో గోదాములను సిద్ధం చేయకపోవడం, స్టాకును గూడ్స్ ద్వారా తరలించకపోవడంతో ధాన్యం తరలింపు ప్రక్రియ నత్తనడక నేర్పుతు న్నది. ఇదంతా వదిలేసి.. కేంద్రం తెలంగాణపై ఆరోపణలు చేస్తున్నది. మరోవైపు ధాన్యం కొనుగోలు చేయకుండా రైతాంగాన్ని మొదటి నుం చి చులకన చేస్తున్నది. కేంద్రం వైఖరి మార్చుకోవాలి.
చులకనగా చూస్తున్న కేంద్రం..
అన్నం పెట్టే రైతన్నను కేంద్ర ప్రభుత్వం చులకనగా చూస్తున్నది. ధాన్యం కొనుగోలు చే యాల్సి ఉన్నా.. రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేక కుట్రపూరితం గా వ్యవహరిస్తున్నది. విఫలమై న సర్కార్.. ఆ తప్పును రా ష్ట్రం మీద నెడుతున్నది. రైతుల పక్షాన ఢిల్లీ వెళ్లిన వారిని అవమానించడం దుర్మార్గం. కేం ద్రం నిరంకుశ వైఖరి మారాలి. కేసీఆర్ సర్కార్‌లో రైతులు సంతోషంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగో లు చేయాలి.
రైతులపై కేంద్రం వివక్ష..
రైతులపై కేంద్రం వివక్ష చూపుతున్నది. ఇచ్చిన మాట ప్రకారం బియ్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడంలో తాత్సారం చేస్తున్నది. రైతుల తరఫున ఢిల్లీ వెళ్లిన మంత్రులతో కేంద్ర మంత్రి మాట్లాడిన తీరు దారుణం. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంలో సీఎ కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలతో అండగా నిలుస్తుంటే.. కేంద్రం నడ్డి విరచాలని చూస్తున్నది. వడ్లు కొంటరా.. కొనరా అనే విషయం స్పష్టం చేయడం లేదు.
రాజకీయాలు చేస్తున్న బీజేపీ
రైతును రాజుగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే.. రాజకీయాలు చేయాలని బీజేపీ సర్కార్ యత్నిస్తున్నది. అనేక సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ అన్నదాతలను ఆదుకుంటున్నారు. ధ్యాం కొనేందుకు కేంద్రం ముందుకు రావడం లేదు. వ్యవసాయానికి వాడే విద్యుత్‌కు మీటర్లు బిగించి రైతును మళ్లీ నష్టాల పాలు చేయాలని చూస్తున్నది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలతో ఆడుకుంటున్నది. బీజేపీ నాయకుల మాటలు వింటుంటే ఈ దేశంలోనే ఉన్నామా అనిపిస్తుంది. రైతుల జీవితాలతో ఆడుకోవడం తగదు. ధాన్యం కొనుగోలుపై సరైన స్పష్టత ఇవ్వాలి.