
హన్వాడ, డిసెంబ ర్ 11 : బతకడానికి భూ మి లేదు. ఉండడానికి ఇల్లు లే దు.. ఆరుబయట జీవనం.. ఇదీ హన్వాడ గ్రామానికి చెందిన మ్యాదరి పద్మావతి జీవిత గాథ.. పద్మావతికి 30 ఏం డ్ల కిందట పెండ్లి జరిగింది. ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఆమె భర్త మరొకరిని వివాహం చేసుకున్నా డు. దీంతో తల్లిదండ్రుల ఇంటికి వచ్చి పాత మట్టి ఇంట్లో జీవనం గడుపుతున్నది. తల్లిదండ్రులు మృ తి చెందారు. కాగా, పద్మావతి అక్కలు వచ్చి ఇం టిని తమకు అమ్మారని ఇల్లు నేలమట్టం చేశారు. దీంతో ఆమెకు ఇల్లు కట్టుకునేందుకు స్థలం లేకపోవడంతో ఆరుబయట చలికి కవర్లు వేసుకొని జీ వనం గడుపుతున్నది. ఒక అమ్మాయికి పెండ్లి చే సింది. మరో అమ్మాయి డిగ్రీ వరకు చదవగా ఇటీవల కరోనాబారిన పడింది. చికిత్స కోసం రూ.7 లక్షలు ఖర్చు చేసింది. కూలి పనులకు వెళ్లగా వ చ్చిన డబ్బులతో మిత్తి చెల్లిస్తున్నది. ఏం చేయలో దిక్కుతోచని స్థితిలో ఉన్నానని, ఎవరైన సాయం చేసి ఆదుకోవాలని పద్మావతి వేడుకుంటున్నది. ఇ ల్లు కట్టిస్తే రుణపడి ఉంటామని కంటతడి పెడుతున్నది. సాయం చేయాలనుకున్న వారు 7993396 138 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరుతున్నది.