
జడ్చర్ల టౌన్, జనవరి 3 : కొవిడ్ నియంత్రణలో భాగంగా ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి చెప్పారు. జడ్చర్లలోని అర్బ న్ హెల్త్ సెంటర్లో సోమవారం 15 నుంచి 18 ఏండ్ల వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. వైద్యశాఖ ఆధ్వర్యం లో మొదటి రోజూ 84 మందికి వ్యాక్సిన్ వేశారు. జడ్చర్ల అర్బన్ పరిధిలో 15 నుంచి 18 ఏండ్ల వారికి మొత్తం 3182 మందికి వ్యాక్సిన్ వేసేందుకు టార్గెట్ ఉన్నట్లు ఆమె తెలిపారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్లను వినియోగించాలన్నారు. అదేవిధంగా పోలేపల్లి సెజ్‌లోని ఓ కళాశాలలో విద్య అభ్యసించేందుకు వివిధ రాష్ర్టాలకు చెందిన 30 మంది విద్యార్థులు వచ్చి న విషయాన్ని తెలుసుకున్న డీఎంవో విజయ్‌కుమార్, అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ శివకాంత్ కాలేజీని పరిశీలించారు. విద్యార్థులను జడ్చర్లలోని ఓ లాడ్జిలో ఐసోలేషన్ చేసి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. రెండు రోజుల్లో పరీక్ష రిపోర్టులు వస్తాయన్నారు. వేర్వేరు కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సా రిక, కౌన్సిలర్లు జ్యోతి, ఉమాశంకర్‌గౌడ్, రాజు, నాయకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి
జడ్చర్ల, జనవరి 3 : టీనేజర్లందరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య అన్నారు. మండలంలోని గంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నుంచి బయటపడాలంటే 15 ఏండ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలని సూచించారు. టీకా వేసుకోవడం వల్ల కరోనా నుంచి బయటపడవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణిల్చదర్, మార్కెట్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బాలసుందర్రెడ్డి, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, వైద్య సి బ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్ వేయించుకోవాలి
మిడ్జిల్, జనవరి 3 : 15 నుంచి 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని తాసిల్దార్ శ్రీనివాసులు అ న్నారు. సోమవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన లో విద్యార్థుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. టీకాపై అవగాహన కల్పించి, తీసుకునేలా బాధ్యత వ్యహించాలని వైద్య సి బ్బందికి సూచించామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వంశీప్రి య, సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తప్పకుండా తీసుకోవాలి
కోయిలకొండ, జనవరి 3 : మండలంలోని టీనేజర్లందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంపీపీ శశికళ, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి సూచించారు. సోమవారం మండలకేంద్రంలోని సివిల్ దవాఖానలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రా రంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, వైస్ ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, ఎంపీటీసీ ఆంజనేయులు, కో ఆప్షన్ ఖాజా, తాసిల్దార్ ప్రకాశ్, ఎంపీడీవో జయరాం, డాక్టర్లు నరేశ్, చంద్రశేఖర్, సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పిల్లలకు టీకా పంపిణీ
మూసాపేట, జనవరి 3 : మండలంలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 15 నుంచి 18 ఏండ్లు ఉన్న వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపీపీ కళావతి, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్వేత, ఎంపీడీవో ఉమాదేవి, సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ ఆంజనేయులు, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, జనవరి 3 : మండలకేంద్రంలో ప్రాథమిక ఆ రోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమవారం ఎం పీపీ సుశీల ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మ హిపాల్‌రెడ్డి, డాక్టర్ ప్రతాప్ చాహాన్, సర్పంచుల సంఘం మం డల అధ్యక్షుడు బాచ్చిరెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు న ర్సింహులు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, నా యకులు తదితరులు పాల్గొన్నారు.
టీకాను తప్పనిసరిగా ఇప్పించాలి
భూత్పూర్, జనవరి 3 : కరోనా నివారణ కోసం 15-18 ఏండ్ల లోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు టీకాను తప్పనిసరిగా ఇప్చించాలని మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్ అన్నారు. సోమవారం మున్సిపాలిటీ కార్యాలయంలో పీహెచ్సీ సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ శేఖర్‌రెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, కమిషనర్ నూరుల్‌నజీబ్, సీహెచ్‌వో రామయ్య, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, జనవరి 3 : ప్రతి గ్రామంలోని టీనేజర్లందరికీ తప్పకుండా టీకా ఇప్పించాలని ఎంపీపీ రమాదేవి అన్నా రు. సోమవారం దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంబించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి షబానాబేగం, వైద్యారోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభం
నవాబ్‌పేట, జనవరి 3 : మండలకేంద్రంలోని ప్రభుత్వ ద వాఖానలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. 15 నుం చి 18 ఏండ్ల లోపు వారందరికీ వ్యాక్సిన్ వేయించాలని వారు కోరారు. కార్యక్రమంలో విండో చైర్మన్ నర్సింహులు, వైస్ ఎంపీ పీ సంతోష్‌రెడ్డి, మండల వైద్యాధికారి డా.హరినాథ్, రైతుబం ధు మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ చెన్నయ్య, సర్పంచ్ గోపాల్‌గౌడ్, ఎంపీటీసీ రాధాకృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.