బాన్సువాడ రూరల్, జనవరి 9: జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం పలు మండలాల్లో టీఆర్ఎస్ నాయకులు, రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం రైతులను సన్మానించారు. బాన్సువాడ మండలంలోని బోర్లం, బోర్లంక్యాంపు గ్రామాల్లో రైతుబంధు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి రైతులతో కలిసి సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా ప్రపంచంలోనే గొప్ప పథకాలుగా నిలిచిపోతాయన్నారు. బోర్లం గ్రామంలో 1412 మంది రైతులకు ఇప్పటి వరకు రైతుబంధు పథకం ద్వారా రూ. 7 కోట్ల 32 లక్షలు అందించినట్లు తెలిపారు. అనంతరం రైతుబంధు వారోత్సవాల సందర్భంగా గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్ సరళ, ఎంపీటీసీ సభ్యురాలు శ్రావణి, బుడిమి సొసైటీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, రైతుబంధు గ్రామ అధ్యక్షుడు నెర్రె నర్సింహులు, ఉప సర్పంచులు మంద శ్రీనివాస్, సాయిలు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, బోర్లం సొసైటీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గోపన్‌పల్లి సాయిలు, శ్రీశైలం, దొడ్ల వెంకట్రాంరెడ్డి, మహ్మద్ ఎజాస్, గోపాల్‌రెడ్డి, జలీల్, జ్యోతి, భూనేకర్ ప్రకాశ్, మన్నె సాయిలు, ప్రశాంత్, రా జారాం, జెగ్గ ఆనంద్, శ్రీనివాస్‌రెడ్డి, రాంచందర్, ర తన్, సుభాష్, బాపురెడ్డి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్ మండలంలో..
నస్రుల్లాబాద్, జనవరి 9: మండలంలోని బస్వాయిపల్లి గ్రామంలో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఎంపీపీ పాల్త్య విఠల్ రైతులతో కలిసి సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శమన్నారు.కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ సాయిలు యాదవ్, వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ప్రతాప్, మసూద్, సాయాగౌడ్, రైతులు పాల్గొన్నారు.