తాండూరు రూరల్, నవంబర్ 23: తాండూరు మండలం, చెంగోల్ గ్రా మంలో మంగళవారం పంచాయతీ కార్యాలయ ఆవరణలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ మల్లేశ్వరీ గౌడ్ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి తీసుకు రావాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎం పీటీసీ సభ్యుడు గౌడి వెంకటేశం, డీసీఎంఎస్ అధికారులు ఉన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
పెద్దేముల్, నవంబర్ 23 : రైతులు వరి కొనుగోలు విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని మంబాపూర్ ఎంపీటీసీ యాలాటి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మంబాపూర్ రైస్ మిల్లో డీసీఎంఎస్ వారి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందన్నారు. ప్రతీ రైతు ప్రభుత్వం ఏర్పాటు చేసి న వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్ధతు ధరను పొం దాలని సూచించారు.
దోమ మండల పరిధిలో..
దోమ, నవంబర్ 23 : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి, కిష్టాపూర్, బడెంపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్ర మంలో సీఈవో యాదగిరి. సర్పంచులు శాంత కొం డారెడ్డి, కవితశ్రీని వాస్‌రెడ్డి, సత్యమ్మనర్సింహులు, ఉపసర్పంచులు, డైరెక్టర్లు పాల్గొన్నారు
దౌల్తాబాద్ మండలంలో..
దౌల్తాబాద్, నవంబర్ 23: మండలంలోని గోక ఫస్లవాద్ గ్రామంలో పీఏ సీ ఎస్ ఆధ్వర్యంలో మం గళ వారం సింగిల్ విండో చైర్మన్ వెంకట్‌రెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేం ద్రం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ టీసీ కేశవరెడ్డి, ఏఈవో శ్రీపతి రెడ్డి, సర్పంచు పాల్గొన్నారు.