తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా మెంటపల్లిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి పాలనలోని పల్లెలకు నేటి పరిస్థితులకు వ్యత్యాసం చూడాలన్నారు. సీఎం కేసీఆర్ కృషితో అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు.
వనపర్తి రూరల్, డిసెంబర్ 10 : తెలంగాణ వచ్చాక ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మెంటపల్లి గ్రామంలో ఇక్రిశాట్, బైఫ్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు మంత్రి హాజరయ్యారు. గొర్రె పిల్లలు పంపిణీ చేసి వ్యవసాయ పనిముట్ల కార్యాలయాన్ని, పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటిం చి వృద్ధులు, వికలాంగులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి పింఛన్లు వస్తున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. ఇక్రిశాట్, బైఫ్ సంస్థల సహకారంతో సాగు పనిముట్లు గ్రామ పంచాయతీకి అప్పగించడం మంచి ఆ లోచన అని అభినందించారు. వీటితో పంచాయతీకి ఆ దాయం, సులువుగా తక్కువ కిరాయికే పనిముట్లు లభిస్తాయన్నారు. సాగునీరు సమృద్ధిగా ఉండడంతో గ్రా మాల్లో వ్యవసాయం జోరుగా సాగుతున్నదని తెలిపా రు. ఇందుకోసం పనిముట్ల ఉపయోగం బాగా ఉంటుందని చెప్పారు. యాసంగిలో వరికి బదులు వివిధ పంట లు సాగు చేసి సిరుల దిగుబడులు సాధించాలని సూ చించారు. సంస్థలు అందించే గొర్రె పిల్లలతో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా వృద్ధిలోకి రావాలని కాంక్షించారు. ఇప్పడు అందిస్తున్న గొర్రెలను పెంచి మ రిన్ని పెంచుకునే స్థాయికి ఎదగాలని కోరారు. ప్రభు త్వం మహిళా సంఘల ద్వారా రుణాలు అందిస్తున్నదని చెప్పారు. వాటితో మహిళలు వృద్ధిలోకి రావాలన్నారు. గ్రామం నుంచి హైవే వరకు బీటీ రోడ్డు, నూతన ఆలయానికి ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ కిచ్చారెడ్డి, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, సర్పంచ్ రామకృష్ణ, ఎంపీటీసీ శశిరేఖ, వాటర్‌షెడ్ చైర్మన్ లోకారెడ్డి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు దశరథం, సుందర్, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు, రైతులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ..
వనపర్తి, డిసెంబర్ 10 : అనారోగ్యం బారిన పడి మెరుగైన వైద్య సేవల కోసం వెళ్లే వారికి సీఎంఆర్ఎఫ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని పలు గ్రామాలకు చెంది న 52 మంది బాధితులకు క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథరెడ్డి, నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
బొడ్రాయి ఉత్సవాలకు హాజరు..
శ్రీరంగాపూర్, డిసెంబర్ 10 : మండలకేంద్రంలో మూడ్రోజులుగా కొనసాగుతున్న బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆయన సతీమణి సింగిరెడ్డి వాసంతి హాజరయ్యారు. శ్రీరంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హోమగుండం వద్ద పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గాయత్రి, జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గౌడ నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్‌స్వామి, సర్పంచ్ వినీలారాణి, నాయకుడు పృథ్వీరాజు పాల్గొన్నారు.