చిక్కడపల్లి : దివ్యాంగులకు ప్రత్యేక సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ (డీఎస్డీ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లభనేని ప్రసాద్, వి.భారతిల ఆధ్వర్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్‌లో వికలాంగుల, వృద్దుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న దివ్యాంగుల సంక్షేమ శాఖ, సంచాలకుల కార్యాలయాన్ని స్వతంత్రంగానే ఉంచాలని, మహిళ, శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయద్దని కోరారు. అదే విధంగా వివిధ జిల్లాల్లో విలీనం అయిన శాఖ కార్యాలయాలను మహిళ శిశు సంక్షేమ శాఖ నుండి వేరు చేయాలని అన్నారు.
కాగా మంత్రి దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. డీఎస్డీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వెంకటేశ్ గౌడ్ నాయకులు, ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.