
రామచంద్రాపురం, జనవరి 3 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆర్సీపురం డివిజన్లోని ఓల్డ్ ఆర్సీపురంలో ఉన్న జడ్పీహెచ్ఎస్లో రూ.8 లక్షలతో సీసీ రోడ్డు, స్ట్రాం వాటర్ డ్రైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం శ్రీనివాస్‌నగర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఎంఈవో జెమినికుమారి, ప్రిన్సిపాల్ దశరథ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తాము పాఠశాల సందర్శనకు వచ్చినప్పుడే సమస్యలను చెబుతారా.. ఇన్ని రోజుల పాటు పాఠశాల సమస్యలు తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఎంఈవో, ప్రిన్సిపాల్‌ను ఎమ్మెల్యే నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రైమరీ పాఠశాలను అభివృద్ధి చేస్తామన్నారు. నియోజకవర్గంలో జూనియర్, డిగ్రీ కళాశాల ఏర్పా టు చేసి ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, డివిజన్ అధ్యక్షుడు గోవింద్, యువజన అధ్యక్షుడు నర్సింహ, నాయకులు ఆదర్శ్‌రెడ్డి, కుమార్‌గౌడ్, మోహన్‌రెడ్డి, మల్లేశ్, కుమార్, ప్రీతిగౌడ్, మక్బుల్, అశోక్, యాదయ్య, శంకర్, కృష్ణమూర్తిచారి పాల్గొన్నారు.
సీఎస్ఆర్ నిధులు మూడు కోట్లతో అభివృద్ధి పనులు
జిన్నారం, జనవరి 3 : అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలకు అధిక నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నిధులు రూ.3 కోట్ల నుంచి జిన్నారం మండలానికి రూ.94 లక్షలు కేటాయించినట్లు ఎమ్మెల్యే మండల సభలో తెలిపారు. సోమవారం జరిగిన మండల సభలో ఎమ్మెల్యే నిధులు రూ.3 కోట్ల నుంచి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించారు. జిన్నారం మండలానికి రూ.94లక్షలు, పటాన్‌చెరుకు రూ. 52.50 లక్షలు, అమీన్‌పూర్‌కు రూ.62 లక్షలు, గుమ్మడిదలకు రూ.89లక్షలు కేటాయించినట్లు వివరించారు. జిన్నారం మండలానికి గ్రామాల వారీగా కేటాయించిన రూ.94 లక్షలను జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ సభలో చదవి వినిపించారు. జంగంపేట, లక్ష్మీపతిగూడెం, రాళ్లకత్వ, వావిలాల, అండూరు, ఊట్ల, నల్తూరు, కొర్లకుంట, శివనగర్, జిన్నారం, ఖాజీపల్లి, సోలక్పల్లి గ్రామాలకు పంచాయతీ భవనాలు, మహిళా భవనాలు, సీసీ రోడ్లు, యూత్ భవనాల కోసం కేటాయించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చోట ఎక్కువ నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో సీఎస్ఆర్ నిధులు మరో మూడు కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతామన్నారు.