ఎల్బీనగర్ : తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఛైర్మన్‌గా దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని ఎన్నుకున్నారు. జాతీయ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్‌కు అనుబంధంగా ఉన్న తెలంగాణ పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్‌కు నూతన ఛైర్మన్‌గా ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 17 నుండి 20వ తేదీ వరకు ఇండియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ 2021 పోటీలు హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ఛైర్మన్ రాజశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు ఓం ప్రకాష్, ఉపాధ్యక్షులు రంగేశ్వరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు అనంతుల రాజారెడ్డి, చిరంజీవి,కత్తుల రాంబాబు, టంగుటూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.