
మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 24 : నాలుగేండ్ల ప్రొఫెషన్ కోర్సు అం దుబాటులో ఉన్నదని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పాలమూరు విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ లక్ష్మీకాంత్ రాథోడ్ అ న్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. భార త ప్రభుత్వం ఎన్సీటీఈ, తెలంగాణ సర్కార్ ద్వారా ఆమోదించడిన బీఎస్సీ, బీఏ-బీఈడీ నాలుగేండ్ల కోర్సును నారాయణపేట జిల్లాలోని శ్రీదత్త బృందావన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ బీఈడీ కళాశాలకు అనుమతులు జారీ చేసినట్లు తెలిపారు. నూతన విద్యా విధానంలో ప్రథమ స్థానం కలిగిన ఈ కోర్సులను తెలంగాణ, ఏపీలో మొదటి సారి గా ప్రవేశపెట్టారని చెప్పారు. సాధారణం గా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ, బీఈ డీ చేయాలంటే ఐదేండ్ల సమయం పడుతుందని, కానీ ఈ ప్రొఫెషన్ కోర్సుతో నాలుగేండ్లలోనే పూర్తి కానున్నదన్నారు. ఈ కోర్సు పూర్తి చేశాక విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. 2021-22 ఏ డాదికి ఈ కోర్సులో ఉన్న సీట్లను భర్తీ చే సేందుకు టీఎస్ ఎడ్‌సెట్ కన్వీనర్ ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయించనున్న ట్లు తెలిపారు. ఈ నె ల 24 నుంచి edcet. tsche.ac.in/ intbed వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మొదటి సంవత్సరానికి రూ.36 వేలు ఫీజు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ పిండి పవన్‌కుమార్, శ్రీదత్త బృందావన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి పాల్గొన్నారు.