కొత్త జిల్లాలు, జోనల్ విధానంలో భాగంగా ఉద్యోగుల బదిలీల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. స్థానికత, సీనియార్టీ ఆధారంగా బదిలీలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో 22,415 మంది ఉద్యోగులకుగానూ స్థానికత మారిన ఉద్యోగుల సంఖ్య 5,930. మొత్తం ఉద్యోగుల్లో తొలి ప్రాధాన్యం పొందిన వారు 14,345 (64 శాతం), రెండోప్రాధాన్యం పొందిన వారు 4,931 (22 శాతం),మూడో ప్రాధాన్యం పొందిన ఉద్యోగులు 3,139 (14 శాతం) ఉన్నారు. వీరందరికీ అలాట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చారు.
వనపర్తి, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ద ళితుల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం వనపర్తి జిల్లాలో త్వరలో ప్రారంభం కానున్నది. గత పాలకులు దళితులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి. కానీ టీఆర్ఎస్ సర్కార్ వారి అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దళితబంధు పథకానికి ముం దుగా రాష్ట్రంలోని నాలుగు మండలాలను ఎంపిక చేసి ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షలు అందజేస్తున్నది. దళితులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రకటించింది. ప్రతిపక్షాలు దీనిని రాజకీయం చేస్తున్నప్పటికీ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. ఈ నెల 18వ తేదీన ఈ పథకంపై సీఎం కేసీఆర్ కలెక్టర్లతో సమావేశమై దిశానిర్ధేశం చేశారు. కమిటీల ఏర్పాటు, లబ్ధిదారుల ఎంపికపై పలు సూచనలు చేశారు. వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక నివేదిక కోసం వివరాలు సేకరించాలని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కమిటీలు..
ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. కమిటీ లో కలెక్టర్ కీలకంగా వ్యవహరించనున్నారు. ఒ క్కో నియోజకవర్గానికి వంద మంది దళితులను అర్హులుగా ప్రకటించనున్నారు. ఎంపికైన వారి ఖాతాల్లో రూ.10 లక్షలు జమకానున్నాయి. అంతేకాకుండా లబ్ధిదారులకు ఏదైనా ప్రమాదం జరిగితే.. వారి కుటుంబ సభ్యులకు కార్పస్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు. ఆర్థిక సాయం అందుకున్న కు టుంబాల వారికి శిక్షణ ఇచ్చి స్వయం ఉ పాధి అవకాశాలు కల్పిస్తారు. వనపర్తి జి ల్లాలో 22,443 మంది దళితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం జనాభాలో 16.67 శాతం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వనపర్తి జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా.. వనపర్తి నియోజకవర్గం పూర్తి స్థాయిలో జిల్లాలో ఉండగా.. కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్‌లోని కొన్ని మండలాలు మాత్రమే ఉన్నాయి. ఇతర జిల్లాలతో కలిసి ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలతో చర్చించి కమిటీ ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారులను ఎంపికచేయనున్నారు. వీటిలో రెవెన్యూ, వివిధ సంక్షేమ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు.
పకడ్బందీగా అమలు..
సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణం గా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయను న్నాం. వందశా తం విజయవం తం చేసేందుకు ప కడ్బందీగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. యువతకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. త్వరలో కమిటీలు ఏర్పాటు చేసి నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేస్తాం.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
దళితబంధు అ మలుతో వారి జీవితాలు మారిపోతా యి. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దళితులను పట్టించుకున్న ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్. రూ.పది కావాలంటే ఇబ్బందులు పడుతున్న మాకు ఊహించని విధంగా రూ.పది లక్ష లు ఇవ్వడం గొప్ప విషయం. దళితులు సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటారు.