కాచిగూడ : స్థానిక ప్రజల సహాకారంతో నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెలుతున్నట్లు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లోని లింగంపల్లి నుండి చెప్పల్‌బజార్ హరిమాజిద్ వరకు చేపడుతున్న నూతన మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పరిశీలించారు.
ఈ మంచినీటి పైప్‌లైన్ పనులతో డివిజన్లోని చెప్పల్‌బజార్, పరుశురామ్యాదవ్ లైన్, గ్యాస్ కంపెనీ లైన్, నారాయణ డాక్టర్ లైన్, హరిమాజీద్లైన్, శివాలయం లైన్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో లోప్రెషర్ సమస్య పరిష్కారం అయిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ఆయా బస్తీలలో పాద యాత్ర నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ గత పదిహేను ఏండ్లుగా అంబర్‌పేటలోని 5 డివిజన్ల అభివృద్ధి కుంటుపడిం దని, త్వరలో అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. అంబర్‌పేట నియెజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేస్తూ, పేదలకు మౌళిక సదుపాయలు కల్పించేందుకు కృషి చేస్తానని హామి ఇచ్చారు.
నిర్మాణపు పనుల్లో స్థానిక ప్రజలు అధికారులను ఎప్పటికప్పుడు నిలదీసినప్పుడే అభివృద్ధి పనులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర భీష్మాదేవ్, జలమండలి ఏఈ భవన, వెంకటేశ్‌యాదవ్, నాగేందర్బాబ్జి, మహేందర్, దినేశ్ తదితరులు పాల్గొన్నారు.