
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 31 : జిల్లాలో గతేడాది నేరాలు తగ్గాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు. నిరంతర నిఘా, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం, సీసీ కెమెరాల ఏర్పాటు, కార్డన్ సెర్చ్ వంటి వాటితో నేరాలను అదుపులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా ప్రజలకు పూ ర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. జిల్లాల విభజనతో ఎస్పీలు, పోలీసుల పర్యవేక్షణ పెరగడం కూడా సత్ఫలితాలిచ్చిందని చెప్పొచ్చు. జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా, మ ద్యం తాగి, ర్యాష్ డ్రైవింగ్ మూలంగా ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకున్నా యి. గతేడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గినా.. మహబూబ్‌నగర్ జిల్లాలో 222, నాగర్‌కర్నూల్‌లో 180 మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 2021లో మహబూబ్‌నగర్ జిల్లాలో 444 రోడ్డు ప్రమాదాల్లో 222 మంది చనిపోయారు. 138 చోరీలు జరిగాయి. పగలు, రాత్రి తేడా లేకుండా అంతర్రాష్ట్ర చెడ్డీ గ్యాంగ్ యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. రూ.2.18 కోట్ల విలువ గల నగదు, వెండి, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. కాగా రూ.1.25 కోట్లు రికవరీ చేశారు. తాళం వేసిన ఇండ్లల్లో పగటివేళ 22, రాత్రివేళ 88 చోరీలు జరిగాయి. గతంతో పోలిస్తే చోరీ కేసులు చాలావరకు తగ్గాయని చెప్పొచ్చు. జిల్లాలో డెకాయిటీ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. దారి దోపిడీ కేసులు 5 జరిగాయి. లైంగిక దాడుల సంఖ్య పెరుగుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు జరుగుతున్నాయి. గతేడాది 20 మంది హత్యకు గురయ్యారు. లైంగిక దాడులు చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నా వాటి సంఖ్య పెరగడం బాధాకరం. మహబూబ్‌నగర్ జిల్లాలో గతేడాది 84 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. 2020లో ఆ సంఖ్య 66 మాత్రమే. అదేవిధంగా కిడ్నాప్ కేసులు పెరగడం కలవరపాటుకు గురిచేస్తున్నది. 2020లో 63 కేసులు నమోదుకాగా, 2021లో ఆ సంఖ్య 92కు చేరుకున్నది. అలాగే డ్రంకెన్ డ్రైవ్‌లో పోలీసులు 13 మందికి జైలు శిక్ష విధించారు. 755 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా రూ.36.73 కోట్ల జరిమానాలు విధించారు. ఒకరికి 15 రోజులు జైలు శిక్ష విధించడం గమనార్హం. మోటారు వాహన చట్టం ప్రకారం నిబంధనలను అతిక్రమించిన 2 లక్షల కేసుల్లో రూ.11.12 కోట్ల జరిమానాలు వసూలు చేశారు. అలాగే ఉమ్మడి జిల్లాలో అవినీతికి పాల్పడుతూ ఎనిమిది మంది అధికారులు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఇందులో ఇద్దరు తాసిల్దార్లు ఉన్నారు. చేపల వ్యాపారుల నుంచి రూ.45 వేలు లంచం తీసుకుంటూ మత్స్యశాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ గంగరావు, మైనింగ్ ఎన్వోసీ కోసం రూ.5 లక్షలు తీసుకుంటూ వెల్దండ తాసిల్దార్ సైదులు, రేవల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ అధికారి రషీద్‌తో పాటు ఐదుగురు అధికారులు పట్టుబడ్డారు.
సమర్థవంతంగా పనిచేశాం..
గతేడాది నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా పనిచేశాం. గుట్కా, మట్కా, పేకాట, జూదం, పీడీఎస్ బియ్యం రవాణాలు తగ్గించాం. లాక్డౌన్ కారణంగా కేసుల సం ఖ్య చాలా వరకు తగ్గింది. డ్రంకెన్ డ్రైవ్‌లో 13 మందిని జైలుకు తరలించాం. నలుగురిపై పీ డీయాక్టు కేసులు నమోదు చేశాం. మహిళలపై నేరాలు కాస్త పెరిగాయి. పోలీసులు, సిబ్బంది కృషితోనే నేరా లు తగ్గాయి. 2022లో కూ డా ఇలాగే పనిచేస్తాం.