అంబర్పేట : యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయమని చెప్తు కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కేంద్రంలో బీజేపీ నేతలు ఒకమాట, రాష్ట్రంలో బీజేపీ నేతలు మరోమాట మాట్లాడున్నారని దుయ్యబట్టారు.
యాసంగిలో పండించే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ధర్నాకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో అంబర్పేట నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2022 కల్లా రైతులను ధనికులను చేస్తానని చెప్పిన కేంద్రం దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. రాజ్యాంగబద్ధంగా వరిని కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని పేర్కొన్నారు. వానాకాలం పంటను కల్లాల వద్దనే కొనే ఏర్పాట్లను సీఎం కేసీఆర్ చేశారని తెలిపారు. కేంద్రం వరి పంటను కొనేదాక ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు.