మన్సూరాబాద్ : మానవాళి సంక్షేమ కోసం కులరహిత సమాజం ఏర్పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
సమ సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్‌లోని హరిణ వనస్థలి నేషనల్ పార్కులో కార్తీక మాస కులాంతర సహపంక్తి వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాల వారిగా వేరు వేరుగా కాకుండా ప్రజలందరూ ఒకే కులంగా ఐకమత్యంతో వన భోజన కార్యక్రమాలు నిర్వహించుకునే రోజులు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సమసమాజ నిర్మాణం కోసం ప్రజలు ఆలోచించాలని ఆయన సూచించారు.
ప్రజలందరూ ఒకే తాటిపైకి వచ్చి కులాలకతీతంగా ఐకమత్యంతో సహపంక్తి వనభోజనాలు ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.