కాచిగూడ : మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులపై కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝలిపించారు. కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనుమాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి అలీకేప్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించారు.
ఈ తనిఖీలో భాగంగా మద్యం సేవించి వాహానాలు నడుపుతున్న 14 మంది వాహనదారులపై కేసు నమోదు చేశారు. ఇందులో 12 ద్విచక్రవాహనలు, 2 కార్లు పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలను నడుపరాదని, అలా ప్రవర్తిస్తే జరిమానాతోపాటు లైసెన్స్కూడా రద్దవుతుందని హెచ్చరించారు.
తాగుడుకు బానిసై తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకోవద్దని, కుటుంబసభ్యులను దృష్టిలోపెట్టుకొని వాహనాలను నడపాలని, ఇతర వాహనదారులకు ఇబ్బంది కల్గించవద్దని ఆయన కోరారు.