ఈ రైతు పేరు బాగాజి పోశెట్టి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని నాళేశ్వర్ గ్రామం. ఈయనకు ముగ్గురు కొడుకులు. అందరి పెండ్లిళ్లు చేసి తనకు ఉన్న ఐదెకరాల పొలంలో ఎకరంన్నర చొప్పున పంచి ఇచ్చాడు. అర ఎకరం ఉంచుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు. వృద్ధాప్య పింఛన్ రూ.2,016తో పాటు రైతుబంధు పథకం కింద రూ.2,500 ఆర్థిక సహాయం పొందుతున్నాడు. ఎవరి దగ్గర చేయి చాచకుండా సొంతంగా పంటను సాగు చేస్తున్నానని పోశెట్టి చెబుతున్నాడు. ‘గీ రైతు బంధు పథకం అచ్చినంక అప్పులు లేకుండా పొలం జేసుకుంటా నేను, నా పెండ్లాం బతుకుతున్నం. కొడుకులకు పైసల్ అడుగుతలె. నాది నేను బతుకుతున్న’ అని తెలిపాడు. ఇంత సహాయం చేస్తున్న కేసీఆర్ దేవుడు ..కేసీఆర్ సార్ సల్లంగ ఉండాలే అని దీవించాడు.