ముషీరాబాద్ : టీఎస్ఎస్పీడీసీఎల్ ఆజామాబాద్ డివిజన్లోని 11 కేవీ శ్రీరామ్‌నగర్, బర్కత్‌పుర, శంకర్‌మఠ్, ఫీవర్ ఆసుపత్రి ఫీడర్ల పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ విజయభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
శ్రీరామ్‌నగర్ ఫీడర్ పరిధిలోని అచ్చయ్యనగర్, శ్రీరామ్‌నగర్, నల్లకుంట, ఫీవర్ ఆసుపత్రి వెనుక భాగం, లంబాడితండా పరిసర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు పేర్కొన్నారు.
బర్కత్‌పుర, శంకర్‌మఠ్ ఫీడర్ల పరిధిలోని పద్మకాలనీ, శంకర్‌మఠ్ కూరగాయల మార్కెట్, బర్కత్‌పుర, మాతృశ్రీ స్కూల్, శంకర్‌మఠ్ రోడ్, అమర్ మెటర్నరీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 11.30 నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారని తెలిపారు.
ఫీవర్ ఆసుపత్రి ఫీడర్ పరిధిలోని అంజయ్య క్వాటర్స్, ఫీవర్ ఆసుపత్రి, తెలంగాణ యువతి మండలి, బర్కత్‌పుర పెట్రోల్ బంక్ పరిసరాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.