
మహబూబ్‌నగర్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొత్త జోనల్ విధానంలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల జిల్లాల కేటాయింపు పూర్తయింది. శుక్రవారం నుంచి కేటాయించిన జిల్లాల్లో పోస్టింగుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇప్పటికే పనిచేస్తున్న జిల్లాల్లోనే ఉన్న ఉద్యోగులు మాత్రం అదే స్థానంలో ఉండనున్నారు. కొత్త స్థానికత ఆధారంగా బదిలీలు ఉంటాయి. కొత్త జిల్లాలకు కేటాయించిన వారికి సీనియార్టీ, వివిధ ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా జాబితా తయారు చేసి పోస్టింగులు ఇవ్వనున్నారు.
పూర్తయిన కేటాయింపులు..
జిల్లా స్థాయిలో కేటాయించిన ఉద్యోగులు వంద శాతం తమకు నిర్దేశించిన చోట రిపోర్ట్ చేశారు. కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులను కేటాయించిన నేపథ్యంలో.. జిల్లాలు మారిన వారికి కొత్త జిల్లాలో పోస్టింగ్‌లు ఇస్తారని అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 22,415 మంది ఉద్యోగులకుగానూ స్థానికత మారిన ఉద్యోగుల సంఖ్య 5,930. మొత్తం ఉద్యోగుల్లో తొలి ప్రాధాన్యం పొందిన ఉద్యోగులు 14,345 (64 శాతం), రెండో ప్రాధాన్యం పొందిన ఉద్యోగులు 4,931 (22 శాతం), మూడో ప్రాధాన్యం పొందిన ఉద్యోగులు 3,139 (14 శాతం). ఉమ్మడి జిల్లాలోని మొత్తం ఉద్యోగులందరికీ అలాట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు.
కొత్తగా కేటాయించిన జిల్లాల్లో పోస్టింగుల ప్రక్రియ..
జిల్లాలకు కేటాయించిన ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కొత్త స్థానికత అనుగుణంగా బదిలీలు, పోస్టింగులపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియ నిర్వహిస్తారు. కొత్త స్థానికత ఆధారంగా సీనియార్టీ జాబితా రూపొందిస్తారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోనున్న ప్రభుత్వం.. కలెక్టర్, జిల్లా విభాగాధిపతితో బదిలీలపై కమిటీని ఏర్పాటు చేసింది. వారం రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. బదిలీలు, పోస్టింగ్‌ల తర్వాత విధుల్లో చేరేందుకు మూడు రోజులు గడువు ఇచ్చింది.
పారదర్శకంగా ప్రక్రియ..
కౌన్సెలింగ్ ద్వారా కొత్త లోకల్ క్యాడర్లకు సంబంధించిన ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగుల లోకల్ క్యాడర్ కేటాయింపు ప్రకారం ఉద్యోగుల బదిలీలు, పోస్టింగుల విషయమై శుక్రవారం మహబూబ్‌నగర్ జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావే శం నిర్వహించారు. సీనియార్టీ జాబితాను రేపటిలోగా త యారుచేయాలని ఆదేశించగా.. నిబంధనల ప్రకారం జాబి తా రూపొందించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను పూర్తిస్థాయిలో అమలు చేయడంతోపాటు అనుకున్న సమయం ప్రకారం ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇదివరకు పనిచేస్తున్న వారు, బయటి నుంచి వచ్చిన వారిని దృష్టిలో ఉంచుకొని ఖాళీల వివరాల జాబితా రూపొందించనున్నారు. గతంలో ఉన్న ఖాళీలు, ఇతర ప్రాంతాలకు ఉ ద్యోగులు వెళ్లడంతో ఏర్పడిన ఖాళీలతో వేకెన్సీ జాబితా త యారు చేయనున్నారు. కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించే పోస్టింగులకు సంబంధించి ఉద్యోగుల ద్వారా మ రోసారి ప్రాధాన్యత తీసుకోనున్నారు. ప్రత్యేక కేటగిరీలు, స్పౌస్ కేసులను పరిగణలోకి తీ సుకొని ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఉ ద్యోగుల పోస్టింగులు, బదిలీలు పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సం ఘాల నుంచి ఒకరిని ఆహ్వానించనున్నా రు.
వంద శాతం పూర్తి..
ఉద్యోగుల కేటాయింపు జరిగింది. జిల్లాలకు వచ్చే వారికి పోస్టింగులు ఇస్తాం. ఇక ఆయా జిల్లాల్లో ఉన్నవారు విభజన ప్రక్రియలో జిల్లా మారకుంటే.. ప్రస్తుతం ఉన్న చోటే ఉండేందుకు అవకాశం దక్కుతుంది. వారు ఇప్పటివరకు ఏ పోస్టులో, ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే ఉంటారు. ఇక ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి ఆయా జిల్లాల పరిధిలో సీనియార్టీ, ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా జాబితా తయారవుతుంది. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకున్న తర్వాత జాబితా ఆధారంగా పోస్టింగ్‌లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు వచ్చాయి. దాని ప్రకారం కేటాయింపులు ఉంటాయి.