హిమాయత్‌నగర్ : తనను వేధింపులకు గురిచేస్తున్న బెల్లంపల్లి పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు మంచిర్యాల జిల్లా, మైలారం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ జంబి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం హైదర్‌గూడలోని ఎన్ ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
మంచిర్యాల జిల్లా, నెన్నెలమండల కేంద్రానికి చెందిన యువతి మౌనిక తన ప్రియుడు మోసం చేశాడని ఇటీవల పురు గులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి వారికి న్యాయం చేయాల ని తాను పోరాటం చేసినందుకు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
తనను వేదిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర డీజీపీ, మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులతో తన ప్రాణానికి ముప్పు ఉందని రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్నికోరారు.