చిక్కడపల్లి : నాగమయ్యకుంట, పద్మకాలనీ, ఓల్డ్ నల్లకుంట వరద నీటి సమస్య నుండి శాశ్వత పరష్కారం కోసం నాలా విస్తారణ నిర్మాణం పనులు చేయిస్తున్నామని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠాగోపాల్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌లు అన్నారు.
హైదరాబాద్ జిందాబాద్, నల్లకుంట వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు గురువారం ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ అమృతలు హాజరై హెరిటేజ్ వద్ద నాలాను పరిశీలించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ హెరిటేజ్ వద్ద నాలా విస్తరణచేసి వరదనీరు వెళ్లడానికి డైవర్షన్ చేస్తామని చెప్పారు.
అనేక సంవత్సరాలుగా నాగమయ్యకుంట,పద్మ కాలనీ,ఓల్డ్ నల్లకుంట ప్రాంతాల ప్రజలు వరద నీటి వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భవిష్యత్తులో వరద సమస్యతో ఏ ఒక్క ఇల్లు ముంపుకు గురికాకుండా చూస్తామని చెప్పారు. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా నాలా విస్తరణ, అభివృద్ధి పనులు చెపడుతామని చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు ముఠా జయసింహ, జీహెచ్ఎంసీ ఎస్ఎన్డిపి ఇఇ శ్రీనివాస్, ఏఈ రాజు, రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ప్రధానకార్యదర్శి దామోదర్ రెడ్డి, ఎ.కిషన్ రావు, మాదవ్, చిట్టి, కూరగాయల శ్రీను, హైదారాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి వీరయ్య, సహాయ కార్యదర్శి శ్రీనివాస్ రావు ,నల్లకుంట వెల్ఫేర్ అసోసియేసన్ నాయకులు రమేశ్ నాయకుడు, బాలకృష్ణరెడ్డి, వినోద్, తదితరులు పాల్గొన్నారు.