రంగారెడ్డి, డిసెంబర్ 16, (నమస్తే తెలంగాణ): ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 60 శాతం ఉత్తీర్ణత సాధించగా.. వీరిలో బాలురు 56, బాలికలు 65 శాతం మంది పాసయ్యారు. 53,619 మంది విద్యార్థులు 32,328 మంది ఉత్తీర్ణులయ్యారు. 28758 మంది బాలురకు 16053, 24861 మంది బాలికలకు 16275 మంది పాసయ్యారు. ఒకేషనల్‌కు సంబంధించి 3063 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 1528(50 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 1824 మందికి 748 మంది, బాలికలు 1239 మందికి 780 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో 2651 మంది ఉత్తీర్ణులు
పరిగి, డిసెంబర్ 16 : ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో వికారాబాద్ జిల్లా పరిధిలో 29శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జిల్లా పరిధిలో జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 9237 మంది విద్యారులకు 2651 మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్‌కు సంబంధించి 8177 మందికి 2186 మంది(27శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 4107 మందికి 720 మంది(18 శాతం), బాలికలు 4070 మందికి 1466 మంది(36శాతం) పాసయ్యారు. ఒకేషనల్ రెగ్యులర్ విద్యార్థులు 1060 మందికి 465 మంది(44శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 410 మందికి 110 మంది(27శాతం), బాలికలు 650 మందికి 355 మంది(55శాతం) పాసయ్యారు. రెండు విభాగాల్లోనూ బాలికల ఉత్తీర్ణత శాతం అధికంగా ఉన్నది.