
ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి
నిజాంపేట, జనవరి 30: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దళితులకు అండగా నిలుస్తున్నదని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నిజాంపేట మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్అజీజ్ గృహ ప్రవేశానికి హాజరైన అనంతరం పీఏసీఎస్ కార్యాలయంలో మండల ప్రజాప్రతినిధులు,టీఆర్ఎస్ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు దళితులను పట్టించుకోలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో దళితులకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు. అర్హులైన ఒక్కో దళిత కుటుంబానికి దళిత బంధు పథకం ద్వారా రూ.10 లక్షలు మంజూరు అవుతాయన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేస్తూ ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు తెలిపే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు , పీఏసీఎస్ చైర్మన్ బాపురెడ్డి ,డైరెక్టర్లు కిష్టారెడ్డి, అబ్దుల్అజీజ్, శ్రీధర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు మావురం రాజు, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ సంపత్, మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, రామాయంపేట మున్సిపాల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, ఏఎంసీ డైరెక్టర్లు వెంకటేశం,రవీందర్, మంగ్యానాయక్, మండల సర్పంచులు గేమ్‌సింగ్,అరుణ్‌కుమార్,ఎంపీటీసీలు సురేశ్, బాల్‌రెడ్డి,గ్రామ అధ్యక్షుడు నాగరాజు,టీఆర్ఎస్ నాయకులు దయాకర్, తిరుమల్, మహేశ్, సత్యనారాయణ, సంతోష్, నగేశ్, ఎల్లం ,రవి ఉన్నారు