షాద్‌నగర్‌టౌన్, డిసెంబర్ 29 : షాద్‌నగర్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్న హైమాస్ట్ లైట్లతో మున్సిపాలిటీ మరింత సుందరంగా మారుతున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో ఏర్పాటు చేసిన నూతన హైమాస్ట్ లైట్లను మంగళవారం రాత్రి మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. అనంతరం పట్టణానికి చెందిన ఎండీ గౌస్‌కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 17వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్ సలేంద్రం రాజేశ్వర్, నాయకులు జూపల్లి శంకర్, జమృత్‌ఖాన్, రజినీకాంత్ పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కొత్తూరు రూరల్ : ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల గ్రామంలోని అనంత పద్మనాభస్వామి నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్ జి.మోహన్‌రెడ్డి, కమిటీ సభ్యులు మామిడి దామోదర్‌రెడ్డి, దేశాల లక్ష్మమ్మ, వన్నం బాలరాజు, డి.బుచ్చయ్య, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఆలయ అర్చకుడు నర్సింహ చేత ఎండోమెంట్ ఆఫీసర్ శ్యాంప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలన్నారు. పెంజర్ల గ్రామ సర్పంచ్ మామిడి వసుంధర ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మట్టి రోడ్డుకు మరమ్మతులను చేపట్టాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ్గన్నారు.కార్యక్రమంలో జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్‌రెడ్డి, సర్పంచ్ వసుంధర, ఎంపీటీసీ అంజమ్మ, పీఏసీఎస్ చైర్మన్ మంజూల, వైస్‌చైర్మన్ పద్మారావు, నాయకులు భీమయ్య, ఎమ్మె సత్యనారాయణ, దేవేందర్, మెండె కృష్ణయ్య, యాదగిరి, శ్రీశైలం, రాజు, జైపాల్, కోస్గీ శ్రీను, శ్రావణ్, రమేశ్ పాల్గొన్నారు.