కులకచర్ల, జనవరి 29 : దేవాలయాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తు న్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధి లోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వరస్వామి దేవాలయ సమీపంలో కల్యాణ మండప నిర్మాణం కోసం రూ.50 లక్షలు మంజూరు కాగా ప్రొసీడింగ్ పత్రాన్ని దేవాలయ కమిటీ చైర్మన్ ఘనాపురం రాములుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, కల్యాణ మండపం నిర్మించడం ద్వారా శుభకార్యాలు చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. త్వరితగతిన కల్యాణ మండప నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికి దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, పూజారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్య హరిశ్చంద్ర, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, రైతు బంధు సమితి మండల అధక్షుడు పీరంపల్లి రాజు, టీఆర్ఎస్ నాయకులు కంగారి ఆంజనేయులు, మాలె కృష్ణయ్యగౌడ్, రాములు నాయక్, బచ్చిరెడ్డి, శ్రీనివాస్, కొండయ్య పాల్గొన్నారు.
పాఠశాలల బలోపేతానికి ‘మన ఊరు మన బడి’
తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నదని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో కులకచర్ల మండలాల పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో పీఆర్టీయూ క్యాలెండర్లు, డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో అభివృద్ధి చెందుతాయన్నారు.
27 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
పరిగి, జనవరి 29 : ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గంలోని పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు మం డలాలకు చెందిన 27 మందికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.17.57లక్షలకు సంబంధించిన చెక్కులను పరిగిలోని తమ నివాసంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ కింద సర్కారు ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో పరిగి మార్కెట్ చైర్మన్ అంతిగారి సురేందర్, నాయకులు పాల్గొన్నారు.