కడ్తాల్, నవంబర్ 28 : మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు పిప్పళ్ల వెంకటేశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని మండల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ అణగారిన కులాల అభ్యున్నతికి, అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు చందోజీ, ఏఎంసీ డైరెక్టర్ లాయక్‌అలీ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు మల్లేశ్‌గౌడ్, రవి, రాఘవేందర్, దాసు, రాజేందర్‌గౌడ్, రాజేశ్, రాజు, యాదయ్య, సత్యం, దేవేందర్‌గౌడ్, మల్లయ్య, నాగార్జున్, భానుకిరణ్, రామకృష్ణ, జంగయ్య, రమేశ్, శ్రీనివాస్, చెన్నయ్య పాల్గొన్నారు.
తలకొండపల్లిలో..
తలకొండపల్లి, నవంబర్ 28 : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని దళిత సంఘం, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యువకులు కృష్ణ, కిరణ్, రాజేందర్, జ్యోతయ్య, యాదగిరి, మహేశ్, గిరి, అనిల్, కుమార్, నర్సింహ, శేఖర్, రమేశ్, వెంకటేశ్, నరేశ్, సురేశ్, శ్రీను పాల్గొన్నారు.
చేవెళ్ల మండల కేంద్రంలో..
చేవెళ్లటౌన్, నవంబర్ 28 : జ్యోతిరావు ఫూలే దేశానికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అత్తెల్లి అనంతరెడ్డి అన్నారు. అనంతరం మహాత్మాజ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలోని ఫూలే, అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు, జంగయ్య, శివ కుమార్, నరేశ్, యాదయ్య, అశోక్, గోపాల్, ప్రవీణ్, నాయకులు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, కృష్ణగౌడ్, అభిలాశ్, శేఖర్‌రెడ్డి ఉన్నారు.
ఆదర్శనీయుడు జ్యోతిరావు ఫూలే
ఆమనగల్లు, నవంబర్ 28 : ఆమనగల్లు మండల కేంద్రంలో జ్యోతిరావుఫూలే వర్ధంతిని బహుజన సంఘాల నాయకులు సుధాకర్, తిరుపతి నిర్వహించారు. అనంతరం పూలే చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బహుజన సంఘాల నాయకులు పరమేశ్, భిక్షపతి, కృష్ణయ్య, విజయ్, మహేశ్, కిరణ్, శ్రీశైలం, విజేయ్, అంజయ్య పాల్గొన్నారు.
కొత్తూరులో..
కొత్తూరురూరల్, నవంబర్ 28: కొత్తూరు మండలకేంద్రంతోపాటుగా ఆయా గ్రామాల్లో బీసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఫూలే వర్ధంతిని నిర్వహించారు. మండలకేంద్రంలోని చౌరస్తాలో జ్యోతిరావు ఫూలే విగ్రహానికి బీసీ సంఘం నాయకుడు బి.దేవేందర్‌యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శంకర్‌పల్లిలో
శంకర్పల్లి, నవంబర్ 28 : శంకర్‌పల్లిలోని ఫూలే విగ్రహానికి పూల మాలలు వేసి మండల నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ వి.సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ బి.కృష్ణ, మాజీ ఉప సర్పంచ్ సాత ప్రవీణ్‌కుమార్, కౌన్సిలర్ శ్రీనాథ్‌గౌడ్, నాయకులు గోపాల్‌రెడ్డి, శ్రీశైలం, రాజేశ్వర్‌గౌడ్, శ్రీనివాస్, ప్రేమ్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.