ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
షాద్‌నగర్ సర్కారు దవాఖానలో
ఐసీయూ విభాగం ప్రారంభం
షాద్‌నగర్, జనవరి 28 : ప్రైవేట్‌కు దీటుగా సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని సర్కారు దవాఖానలో నూతనంగా ఏర్పాటుచేసిన ఐసీయూ వైద్య సేవల విభాగాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో వైద్య సేవలను విస్తృతపర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయడంతో పాటు గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, కాలేయ సమస్యలు వంటి వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. కొవిడ్ వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్ర వైద్య శాఖ చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే ఉత్తమ ఫలితాలను ఇస్తున్నదన్నారు. షాద్‌నగర్ పట్టణంలో రానున్న రోజుల్లో ట్రామ కేర్, డయాలసిస్ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, కౌన్సిలర్ బచ్చలి నర్సింహ, నాయకులు మన్నె నారాయణ, రాజావరప్రసాద్, పాపయ్యయాదవ్, జూపల్లి శంకర్, శ్రీకాంత్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అపూర్వ సమ్మేళనం
కేశంపేట, జనవరి 28: మండల పరిధిలోని కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2001-02 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు శుక్రవారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరై పాఠశాలలో ఏర్పాటు చేసిన సర్వస్వతిదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ నవీన్‌కుమార్, జడ్పీ వైస్‌చైర్మన్ ఈట గణేష్, జడ్పీటీసీ విశాల, ఉపాధ్యాయులు శ్రీరాములు, యాదగిరి, శివకుమార్, కల్యాణం, భద్రప్ప, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు ఘన సన్మానం
కొందుర్గు, జనవరి 28 : జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రంలో రోడ్డు నిర్మాణానికి రూ.85లక్షల నిధులు మంజూరు అయ్యాయి. శుక్రవారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను మండల టీఆర్ఎస్ నాయకులు శాలువాతో సన్మానించారు. మండల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ఎమ్మెల్యే మరిన్ని నిధులు మంజూరు చేసి మండలాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికోసం తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హాఫీజ్, చంద్రబాబుగౌడ్, అక్రం, రాములు, రాంచంద్రయ్య, ఇస్మాయిల్, అజ్మిరీ పాల్గొన్నారు.