
కేఆర్ఎంబీ సభ్యుడు రవికుమార్ పిైళ్లె
సింధనూర్ వద్ద ఆర్డీఎస్ ప్రధాన కాల్వపై టెలిమెట్రీ ఏర్పాటుకు చర్యలు
ఆర్డీఎస్ ఆనకట్ట, సింధనూర్ హెడ్‌రెగ్యులేటరీ, తుమ్మిళ్ల, సుంకేసుల ప్రాజెక్టుల సందర్శన
అయిజ, జనవరి 28 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణ పనులు మూడు రాష్ర్టాలు సామరస్యంగా చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యుడు రవికుమార్ పిైళ్లె సూచించారు. శుక్రవారం కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట, అయిజ మండలంలో ని సింధనూర్ సమీపంలోని హెడ్‌రెగ్యులేటరీ, తు మ్మిళ్ల ఎత్తిపోతల పథకం, సుంకేసుల రిజర్వాయర్‌ను కేఆర్ఎంబీ బృందం సందర్శించింది. ఆర్డీఎ స్ ఆధునీకరణ పనుల్లో భాగంగా ప్యాకేజీ-1 ప నులు సకాలంలో పూర్తి చేస్తేనే ఆనకట్ట పటిష్టంగా ఉంటుందని పిైళ్లె వెల్లడించారు. ఆర్డీఎస్ ఆనకట్ట కు భారీగా వరదలు వస్తే ధ్వంసమయ్యే అవకా శం ఉన్నదని ఆర్డీఎస్ అధికారులు కేఆర్ఎంబీ బృందానికి వివరించారు. ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు కేటాయించిన నీటి వాటా, ప్రస్తుతం వినియోగించుకుంటున్న నీరు, ఆనకట్ట పటిష్టత, పూ డికతీత, ప్రధానకాల్వ ఆధునీకరణ తదితర అం శాలపై ఆరా తీశారు. అనంతరం అయిజ మండలంలోని సింధనూర్ గ్రామం సమీపంలో హెడ్‌రెగ్యులేటరీని సందర్శించి, టెలిమెట్రీ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులను అ డిగి తెలుసుకున్నారు. అలాగే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం, సుంకేసుల రిజర్వాయర్, కేసీ కెనాల్‌ను ఈ బృందం పరిశీలించింది. సుంకేసుల, కేసీ కెనా ల్ నీటి వినియోగం, టెలిమెట్రీ విధానం తదితర అంశాలపై కర్నూల్ ఇరిగేషన్ అధికారులను అడి గి తెలుసుకున్నారు. కృష్ణానది పరీవాహక ప్రాం తంలోని ప్రాజెక్టుల పనితీరు. నీటి లభ్యత, వినియోగం, ఆయకట్టు తదితర అంశాలపై పూర్తిగా అధ్యయనం చేసేందుకే ప్రాజెక్టులను సందర్శించినట్లు తెలిపారు. పూర్తి నివేదికను కృష్ణా రివర్ మే నేజ్మెంట్ బోర్డు చైర్మన్ వీకే సింగ్‌కు అందిస్తామ ని పేర్కొన్నారు. వారి వెంట బోర్డు ఎస్ఈ అశోక్, ఆర్డీఎస్ ప్రాజెక్టు ఈఈ శ్రీనివాస్, డీఈ సచీంద్రనాథ్ సేత్, ఏఈ నిరంజన్ ప్రసాద్ ఉన్నారు.