జన్మదిన వేడుకల్లో జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి
గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా దివ్యాంగులకు ట్రై స్కూటీలు పంపిణీ
షాబాద్, డిసెంబర్ 27 : పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం జడ్పీటీసీ పుట్టినరోజు సందర్భంగా నగరంలో మంత్రి కేటీఆర్‌ను కలిసి బొకే అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం షాబాద్‌లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్‌లు కట్ చేసి సంబురాల్లో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో తన జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద అవినాశ్‌రెడ్డి తన సొంత డబ్బులు రూ.10లక్షలతో దివ్యాంగులకు ట్రై స్కూటీలు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలు గజమాలలతో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు, కార్యకర్తల అభిమానానికి ఎల్లవేళలా రుణపడి, ప్రజాసేవకు కృషి చేస్తానని తెలిపారు.
పట్నం(తమ)కుటుంబానికి రాజకీయ జీవితాన్ని అందించిన షాబాద్‌ను ఎప్పటికీ మరిచిపోబోమని స్పష్టం చేశారు. షాబాద్ మండలానికి అత్యధికంగా నిధులు తీసుకువచ్చి జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. తన పుట్టినరోజున దివ్యాంగులకు తనవంతు సాయంగా ట్రై స్కూటీలు అందించినట్లు తెలిపారు. దశలవారీగా పేదలు, వృద్ధులకు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంఏ మతీన్, శేరిగూడెం వెంకటయ్య, నక్క శ్రీనివాస్‌గౌడ్, కొలన్ ప్రభాకర్‌రెడ్డి, పొన్న నర్సింహారెడ్డి, కౌకుంట్ల రాజేందర్‌రెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్సింగ్‌రావు, శ్రీరాంరెడ్డి, వెంకట్‌యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు తొంట వెంకటయ్య, జిల్లా లీగల్ అడ్వైజర్ పీసరి సతీశ్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు చాంద్‌పాషా, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇమ్రాన్, అరీఫ్, ముఖ్రంఖాన్, మునీర్, పార్టీ ఉపాధ్యక్షుడు కారు చెన్నయ్య, నాయకులు రమేశ్‌యాదవ్, దర్శన్, పరిగి గణేశ్‌గౌడ్, రాంచంద్రారెడ్డి, నర్సింహారెడ్డి, మల్లికార్జున్‌గౌడ్, అవిలాశ్గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, దయాకర్‌చారి, కృష్ణగౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.