తాండూరు రూరల్, డిసెంబర్ 26: తాండూరులోని సెయింట్ మార్క్స్ స్కూల్ సమీపంలో శనివారం రాత్రి ఓ సిమెంట్ ట్యాంకర్ అతివేగంగా వచ్చి డివైడర్ పైకి ఎక్కింది. సుమారు అర కిలోమీటర్ వరకు డివైడర్ పై వెళ్లి ఆగిపోయింది. రాత్రి సమయంలో కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే రోడ్డు ఎండింగ్లో డివైడర్‌కు సూచిక బోర్డు లేక పోవ డం వల్లనే ట్యాంకర్ డివైడర్‌పైకి వెళ్లిందని స్థానికులు అం టున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం జరి గాయి. అయినా ఆర్అండ్బీ అధికారులు కనీసం సూచిక బోర్డు ఏర్పాటు చేయలేదని లారీ డ్రైవర్లు అంటు న్నారు. డివైడర్‌పై కూరుకుపోయిన సిమెంట్ ట్యాంకర్‌ను రెండు క్రేన్ల సహాయంతో బయటకు తీశారు. ప్రమాదాల నివారణకు ఆర్అండ్బీ అధికారులు ఇప్పటికైనా సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.