కరెంట్, ఇతర సౌకర్యాల కోసం నిధులు వినియోగం
రంగారెడ్డి జిల్లాలో మొత్తం 83 రైతు వేదికలు
తొలిసారిగా జిల్లాకు రూ. 19.92 లక్షలు విడుదల
క్లస్టర్ల వారీగా బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న అధికారులు
సాగు విధానాలపై రైతులకు అవగాహన
రంగారెడ్డి జిల్లాలోని 83 రైతువేదికల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తొలిసారిగా ఒక్కో రైతు వేదికకు ఏడాదికి రూ. 24 వేల చొప్పున జిల్లాకు రూ.19.92లక్షలను కేటాయించింది. ఈ నిధులను కరెంట్, ఇతర సౌకర్యాలకు వినియోగించనున్నారు. ఒక్కో రైతువేదిక నిర్వహణకు నెలకు రూ. 2వేల చొప్పున జిల్లాకు నెలకు రూ.1.66లక్షలు రానుండగా, క్లస్టర్ల వారీగా అధికారులు బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. ఇప్పటికే రైతువేదికల్లో అన్నదాతలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి వరికి బదులు ఇతర పంటలు సాగు చేసేలా అధికారులు సలహాలు, సూచనలను అందిస్తున్నారు. ఏ సీజన్లో ఏ పంటలు వేయాలి.. విత్తనాల ఎంపిక.. పురుగు, కలుపు మందుల వాడకం, భూసార పరీక్షలు, తదితర అంశాలనూ వివరిస్తున్నారు.
షాబాద్, డిసెంబర్ 26: గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతువేదిక భవనాల నిర్వహణకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. రైతులకు వ్యవసాయాధికారులు ఏ సీజన్లో ఏ పంటలు వేయాలి, విత్తనాల ఎంపిక, పురుగు, కలుపు మందుల వాడకం, భూసార పరీక్షలు తదితర అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు సభలు, సమావేశాలు నిర్వహించుకునేలా ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లాను 83 క్లస్టర్లుగా విభజించి, ఒక క్లస్టర్‌కు ఒక రైతువేదికను రూ.24లక్షల నిధులతో నిర్మించి, వ్యవసాయాధికారిని నియమించిం ది. మొదటి సారిగా ఒక్కో రైతువేదికకు ఏడాదికి రూ.24 వేల చొప్పున మొత్తం రూ.19.92 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా ఒక్కో రైతువేదిక నిర్వహణకు నెలకు రూ.2 వేల చొప్పున కేటాయించాలని నిర్ణయించింది. ఈ లెక్కన జిల్లాలోని 83 రైతువేదికల నిర్వహణకు నెలకు రూ. 1.66 లక్షలు రానుండగా, అధికారులు క్లస్టర్ల వారీ గా బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. ఈ నిధులతో రైతువేదిక భవనాల్లో నిరంతరం కరెంట్ సరఫరా, ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 83 రైతువేదికలు
జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, రా జేంద్రనగర్, మహేశ్వరం, ఆమనగల్లు(కల్వకుర్తి) నియోజకవర్గాల పరిధిలోని 25 మండలాల్లో ప్ర భు త్వం 83 రైతువేదిక భవనాలను నిర్మించింది. ఒక్కో రైతువేదికకు రూ.24 లక్షల చొప్పున దాదాపుగా రూ. 20 కోట్ల వరకు వెచ్చించి నిర్మించింది.
రైతు వేదికల్లో అవగాహన సదస్సులు
కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధా న్యం కొనుగోలు చేయబోమని స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభు త్వం రైతులను ఇతర పంటల సా గు వైపు మళ్లించేలా చర్యలు తీసుకుంటున్నది. వరికి బదులుగా తక్కువ పెట్టుబడితో అధిక లాభా లు వచ్చే కూరగాయలు, పప్పుదినుసులు, నూనెగింజలు, తదితర పంటలను సాగు చేసేలా వ్యవసాయాధికారులు రైతువేదికల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఏ సీజన్లో ఏ పంటలను సాగుచేయాలి, పురుగు మందులు ఏమి వాడాలి, విత్తనాల ఎంపిక, భూసా ర పరీక్షలు తదితర అంశాలపై గ్రామీణ ప్రాంతాల్లోని సన్న, చిన్నకారు రైతులకు అవగాహన కల్పించడంతోపాటు, రైతులందరూ ఒక దగ్గర కూర్చొని చర్చించుకునేలా ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతువేదిక భవనాలు అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం
రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి జీవం పోసేలా అనేక పథకాలను అమలు చేస్తు న్నది. రైతువేదిక భవనాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం గొప్ప పరిణామం.
-కొలన్ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి సభ్యుడు
ఒక్కో రైతు వేదికకు రూ. 24 వేలు వచ్చాయి
జిల్లాలోని 83 రైతువేదిక భవనాలకు ప్రభుత్వం నుంచి ఒక్కో రైతు వేదికకు ఏడాదికి రూ. 24 వేల చొప్పున నిధులు విడుదల అయ్యాయి. వీటితో ఆయా రైతువేదికల్లో విద్యుత్ సరఫరాతోపాటు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నాం. తమ సిబ్బం ది వారి వారి క్లస్టర్ల పరిధిలోని రైతువేదికల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
-గీతారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి