
ఘనంగా జయంతి వేడుకలు
నివాళులర్పించిన నేతలు
కోస్గి, డిసెంబర్ 25 : దివంగత, దేశ మాజీ ప్రధానమం త్రి అటల్ బిహారీ వాజేపేయి సేవలు చిరస్మరణీయమని బీజేపీ నాయకులు అన్నారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు వాజ్‌పేయి జయంతి వేడుక లు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ ప్రధానిగా వాజ్‌పేయి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. విపక్షాల ప్రశంసలు సైతం అందుకున్న గొప్ప వ్యక్తి వాజ్‌పేయి అన్నారు. అటల్జీ పాలనలో దేశం అగ్రగామిగా నిలిచిందన్నారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నారాయణ, వెంకటేశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద మండలంలో…
దామరగిద్ద, డిసెంబర్ 25 : దేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి వేడుకలు శనివారం మండలకేంద్రంలో నాయకులు ఘనంగా ని ర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో బీజేపీ మండలాధ్యక్షుడు సత్యనారాయ ణ, జిల్లా నాయకులు గోపాల్‌రావు, సీనియ ర్ నాయకుడు వెంకటప్ప, మైనార్టీ నాయకు లు అబ్దుల్ నబీ, రంజిత్, నర్సింహులు, రా ములు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వాజ్‌పేయి జయంతి
మూసాపేట(అడ్డాకుల), డిసెంబర్ 25 : దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్‌బిహారీ వాజ్‌పేయి జయంతిని శనివారం అడ్డాకుల, మూసాపేట మండలకేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గట్టు మలేశ్, రమేశ్, చెన్నాగౌడ్, సూర్యనారాయణ, వేగనాథ్, అరవింద్‌రెడ్డి, దశరథ్‌రెడ్డి, వెంకట్‌సాగర్, రాజు, తిరుపతి, సురేందర్‌రెడ్డి, బుచ్చన్నయాదవ్, కేశవులు, రవీందర్‌గౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, దే వేందర్‌రావు, సీజీ మధు, ఆంజనేయులు, అశోక్‌రెడ్డి, ర ఘుపతి, శ్రీనివాస్‌నాయక్, ఆంజనేయులు, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, డిసెంబర్ 25 : మండలకేంద్రంలో దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్‌బిహారీ వాజ్‌పే యి జయంతిని ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డోకూరు ఎంపీటీసీ యజ్ఙభూపాల్రెడ్డి, నాయకులు చంద్రశేఖర్, నారాయణరెడ్డి, కృష్ణంరాజు, శ్రీశైలంఆచారి తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, డిసెంబర్ 25 : మండలకేంద్రంలో బీజేపీ నాయకులు వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి వాజ్‌పేయి అందించిన సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో చెన్నప్ప, వెంకటయ్య, బుచ్చిరెడ్డి, మహేందర్‌రెడ్డి, పుల్లయ్య, ఆంజనేయులు, జూక్యానాయక్, పాపయ్య, కేశవులు, మల్లేశ్, రఘువీర్, జనార్దన్, కుర్మయ్య, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మున్సిపాలిటీలో..
భూత్పూర్,డిసెంబర్ 25 : మున్సిపాలిటీలోని చౌరస్తా లో మాజీ ప్రధానమంత్రి అటల్బీహారి వాజ్‌పేయి జయంతిని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, స దానంద్, ఫరూఖ్, నరేందర్, సిద్ధి రామేశ్వర్, చక్రధర్, ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.