
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 25 : చెస్‌తో మేథోశక్తి పెంపొందుతుందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. శాంతానారాయణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం జిల్లాకేంద్రంలోని శ్రీశ్రేష్ఠ స్కూల్లో చెస్, అబాకాస్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నా రు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహు లు, కౌన్సిలర్ పటేల్ ప్రవీణ్, శ్రీశ్రేష్ఠ స్కూల్ డైరెక్టర్ రాజేశ్వర్‌రెడ్డి, ఆనంద్‌బాబు, అనూష పాల్గొన్నారు.
పచ్చని పట్టణంగా మహబూబ్‌నగర్
పచ్చని పట్టణంగా మహబూబ్‌నగర్ మారుతున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని న్యూటౌన్‌లో ప్రధానరహదారి సెంట్రల్ లైన్లో మొక్కలు నాటే పనులను పరిశీలించారు. అలాగే అప్పన్నపల్లి నుంచి ఎదిరకు వెళ్లే మార్గంలో రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ మహబూబ్‌నగర్ రూపురేఖలు మార్చేందుకు అ హర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతు న్న అభివృద్ధి కార్యక్రమాలతో మహబూబ్‌నగర్‌ను మహానగరంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ తా టి గణేశ్, కౌన్సిలర్లు పటేల్ ప్రవీణ్, కట్టా రవికిషన్‌రెడ్డి, రామ్, శ్రీనివాస్‌రెడ్డి, కమిషనర్ ప్రదీప్‌కుమార్ ఉన్నారు.