
ద్వేషం కన్నా ప్రేమ మిన్న అని చాటారు
పాపులను రక్షించేందుకు భూమి మీదకు..
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి టౌన్, డిసెంబర్ 25 : ఏసుప్రభు బోధనలు పాటించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓలివ, టౌన్ చర్చీలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు, క్రైస్తవ మత పెద్దలతో కలిసి కేక్ కట్ చేశారు. ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ కానుకలను పేద క్రైస్తవులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఏసు చాలా గొప్పవారని చెప్పారు. సహనం, ఓర్పు, ప్రేమ ద్వారా ప్రతి ఒక్కరి మనసు గెలుచుకున్నారని స్పష్టం చేశారు. అందుకే విశ్వంలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం ఆ యనకు లభించిందన్నారు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం ఏసు జన్మించిన తర్వాతే ఆవిర్భవించాయని తెలిపారు. ద్వేషం కన్నా ప్రేమ మిన్న అని చాటారన్నారు. పాపులను రక్షించేందుకే భూమిమీద జన్మించి సహనానికి, ప్రేమకు, త్యాగానికి ప్రతిరూపంగా శిలువ ధరించారని గుర్తు చేశారు. భగవంతుడు ఒక్కడేనని, విశ్వాసాలు, నమ్మకాలు మాత్రం వేరని చెప్పారు. లోకకల్యాణం కో సం ఏసు శిలువ కాబడ్డారని గుర్తు చేశారు. ప్రతి ఒక్క రూ ఏసు ప్రభోదాలు అనుసరించడంతోనే దేశం, రా ష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఆయనన్నారు. కార్యక్రమంలో ఓలివ, టౌన్ చర్చి నిర్వాహకులు స్టీఫెన్ ప్రకాశ్, మోజెస్, ప్రసాద్, జాన్‌మార్క్, పరంజ్యోతి, యాకోబు, కేశవులు, గంధం నాగరాజు, రంగస్వామి, జయానంద్, పీడీ సుకన్య, డాక్టర్ లివింగ్స్టన్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, కోళ్ల వెంకటేశ్, ఎర్నెస్ట్, ప్రభాకర్, క్రైస్తవులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తాళ్ల చెరువు అలుగు వద్ద మంత్రి పూజలు..
వనపర్తి, డిసెంబర్ 25 : జిల్లా కేంద్రంలోని తాళ్ల చె రువు అలుగు పారుతున్న నేపథ్యంలో శనివారం మం త్రి నిరంజన్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ముందుగా కట్ట మొత్తం కలియతిరిగి అలుగు వద్ద పూజలు చేశారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, వనపర్తి సింగిల్‌విండో చైర్మన్ పోతులపల్లి రాజు, నాయకులు వెంకటేశ్, నాయకులు పాల్గొన్నారు.
మెడికల్ కళాశాల పనులను వేగంగా చేపట్టాలి..
వనపర్తి రూరల్, డిసెంబర్ 25 : జిల్లాలో నూతనం గా ఏర్పాటు కానున్న మెడికల్, నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ శంకుస్థాపన పనులను వేగంగా చేపట్టాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రానికి స మీపంలోని మర్రికుంట ప్రాంతంలోని నిర్మిస్తున్న మెడికల్, నర్సింగ్ కళాశాల భవన పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు రూ. 700 కోట్లతో 600 పడకల వసతులతో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఈ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. అందుకు తగ్గట్లుగా పనులను వేగవంతం చేయాలన్నారు. మెడిక ల్, నర్సింగ్, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు నూతన భవనాలతో జిల్లాకు మరింత శోభ రానున్నదని ఆయనన్నారు. జిల్లాలో చేపట్టిన రోడ్డు వెడల్పు పనులు పూర్తయితే వనపర్తికి మరిన్ని సొబగులు రానున్నాయన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, వనపర్తి, నాగవరం సహకార సంఘం చైర్మన్లు వెంకట్రావు, మధుసూదన్‌రెడ్డి, గొర్రెల, కాపరుల సంఘం చైర్మన్ కురుమూర్తి యాదవ్, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఉస్మాన్, కోళ్ల వెంకటేశ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవికుమార్, గౌడనాయక్, రవిప్రకాష్‌రెడ్డి, డ్యానియల్, నర్సింహ, విష్ణుసాగర్, గణేశ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.